హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ హైదరాబాద్ నగరానికి చెందిన ఈషా సింగ్ వెండి పతకం సాధించడం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఐదుసార్లు షూటఆఫ్స్‌లో ఒత్తిడిని ధైర్యంగా ఎదుర్కొని స్వల్ప తేడాతో బంగారు పతకాన్ని కోల్పోయినా ఆమె ప్రదర్శన అద్భుతమని ప్రశంసించారు. ఈషా సింగ్ పోరాట స్ఫూర్తి క్రీడాలోకానికి ఆదర్శనీయమని అన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ వేదికలపై మరెన్నో గొప్ప విజయాలు అందుకుని దేశ ప్రతిష్ఠను, తెలంగాణ కీర్తిని చాటాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





