– ప్రొటోకాల్‌ను తప్పక పాటించాలి
– అధికారులకు స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ దిశానిర్దేశం
– అధికారులకు స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ దిశానిర్దేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని రవాణా, ఆర్ అండ్ బి శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ అధికారులను ఆదేశించారు. గోల్కొండ కోటలో శనివారం నిర్వహించనున్న స్వాతంత్య్ర దిన వేడుకలు జరిగే ప్రాంతాన్ని గురువారం సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఆయన గురువారం పరిశీలించారు. అందరూ సమన్వయంతో పనిచేయాలంటూ శాఖల వారీగా ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షాకాలం నేపథ్యంలో కార్యక్రమంలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా వాటర్‌ప్రూఫ్ షామియానాలు, వాటర్‌ప్రూఫ్ జనరేటర్, నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, బ్యారికేడింగ్, గ్యాలరీలు, అతిథులు, విద్యార్థులు, ప్రజల సీటింగ్ సామర్థ్యం, సౌండ్ సిస్టమ్ తదితర ఏర్పాట్లను సమీక్షించారు. కార్యక్రమ నిర్వహణలో ఎక్కడా ప్రొటోకాల్‌కు ఇబ్బంది కలగకుండా అధికారులు నిబద్ధతతో వ్యవహరించాలని ఆయన సూచించారు. అదేవిధంగా స్టేజీ ఏర్పాటుతోపాటు సుందరీకరణ పనులను వేగవంతంగా చేపట్టాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నందున ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పిల్లలు వచ్చే ప్రతి వాహనంలో ఒక లైజనింగ్ అధికారి తప్పనిసరిగా ఉండేలా చూడాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పంద్రాగస్టు వేడుకలకు ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఘనంగా ఉండాలని, ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పక్కాగా, వేగవంతంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రికి సమర్పించే పోలీసుల గౌరవ వందనం, పోలీస్ కవాతును ఆయన ఉన్నతాధికారులతో కలిసి వీక్షించారు. కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, సమాచార శాఖ కమిషనర్ జి.ముకుంద రెడ్డి, అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్, స్వాతి లక్రా, సీపీ సజ్జనార్, అడిషనల్ సీపీ తప్సీర్ ఇక్బాల్, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్, ఇంటెలిజెన్స్ ఓఎస్డీ కమలాసన్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ జితేందర్ రెడ్డి, సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ డి.ఎస్.జగన్, చీఫ్ ఇంజనీర్ రాధాకిషన్, రీజినల్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ జయ రామమూర్తి, ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ రాజేశ్వర్ రెడ్డి, ఫైర్ ఆఫీసర్ వెంకన్న, ఆర్డీవో రామకృష్ణ, డీఈఓ యాదయ్య, ఆర్ అండ్ బి, విద్యుత్, వైద్య, జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
——————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




