– గోషామహల్ పోలీస్ స్టేడియాన్ని పరిశీలించిన డిజిపి
– సభా వేదిక, రాకపోకలు, పార్కింగ్ పై సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 5: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్స వం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని డిజిపి సి.వి.ఆనంద్ అధికారులను ఆదేశించారు. అక్టోబరు 21న గోషామహల్ పోలీస్ స్టేడి యంలో నిర్వహించనున్న పోలీసు అమరవీ రుల సంస్మరణ దినోత్సవానికి సంబంధించి సోమవారం స్టేడియాన్ని పరిశీలించిన ఆయన ఏర్పాట్లపై సమీక్షించారు. సభావేదిక నిర్మా ణం, ప్రముఖుల రాకపోకలు, ప్రవేశ, నిష్క్ర మణ మార్గాలు, వాహనాల పార్కింగ్ తదితర అంశాలను పరిశీలించారు.
నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
స్టేడియంలో కొనసాగుతున్న వివిధ నిర్మా ణ పనుల పురోగతిని డిజిపి సమీక్షించారు. 48 గుర్రాలకు వసతి కల్పించే ఆధునిక అశ్వ శాల సముదాయం, పోలీసు జాగిలాల కెన్నె ల్స్, ఐదు అంతస్థుల సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (సీఏ ఆర్) భవనం, క్రీడా మైదానాలు, అథ్లెటిక్స్ సదుపాయాల నిర్మాణాలను పరిశీలించారు. పనుల్లో జాప్యం చేయొద్దన్నారు. అధికారులు, ఇంజినీర్లు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడు వులోగా పనులు పూర్తి చేయాలని కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




