– ఆర్మూర్‌లో టూరిస్ట్ బస్సును ఢీకొన్న లారీ
నిజామాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 13 : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండల పరిధిలోని గోవింద్‌పేట్ బ్రిడ్జి సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ ప్రాంతానికి చెందిన భక్తులు రెండు టూరిస్ట్ బస్సుల్లో హైదరాబాద్ ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రానికి బయల్దేరారు. ఈ క్రమంలో గోవింద్‌పేట్ బ్రిడ్జి సమీపానికి రాగానే ఓ బస్సు పంక్చర్ అయింది. దీంతో బస్సును హైవేపై నిలిపారు. బస్సులోని కొందరు ప్రయాణికులు కిందకు దిగి రహదారి మధ్యలోని డివైడర్‌పై కూర్చున్నారు. కొద్దిసేపటికి వెనుక నుంచి వచ్చిన ఓ లారీ ఆగి ఉన్న బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు ముందుకు కదిలి డివైడర్‌పై కూర్చున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సుజాత (54), మాధవి (47) అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు మహిళలు సునీత, చిటక్కకు తీవ్రగాయాలు కావడంతో వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలాన్ని నిజామాబాద్ సీపీ పి.సాయి చైతన్య పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును పోలీసులను అడిగి తెలుసుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు