– హైదరాబాద్ టెకీపై కేసు నమోదు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27: కొండాపూర్ ప్రాంతంలో విదేశీ యువతి పట్ల ఓ సాప్ట్‌వేర్ ఇంజినీర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. నెదర్లాండ్స్‌కు చెందిన యువతి తన బాయ్‌ఫ్రెండ్‌ను కలిసేందుకు మార్చి నెలలో భారత్‌కు వచ్చింది. ఆయువతి.. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి నివసిస్తుండగా, అదే ఇంట్లో మరో యువకుడు ఆదిత్య ఆనంద్ ఉంటున్నాడు. అతడు సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బాయ్‌ఫ్రెండ్ ఇంట్లో లేని సమయంలో ఆదిత్య ఆనంద్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని నెదర్లాండ్స్ యువతి ఆరోపణలు చేసింది. యువకుడి చేష్టలతో విసిగిపోయిన యువతి.. భారత్ నుంచి తిరిగి నెదర్లాండ్స్‌కు వెళ్లి అక్కడి ఎంబసీకి ఫిర్యాదు చేసింది. మూడు రోజుల క్రితం యువతి తిరిగి హైదరాబాద్‌కు వచ్చింది. జరిగిన విషయాలన్నింటినీ గచ్చిబౌలి పోలీసులకు వివరించింది. యువతి ఫిర్యాదు ఆధారంగా ఆదిత్య ఆనంద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం యువకుడు పరారీలో ఉన్నాడు. యువకుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




