– రైతు వేదికల్లో అందుబాటులో నాణ్యమైన విత్తనాలు
– వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్
షాద్‌నగర్, ప్రజాతంత్ర, జూలై 27: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వర్షపాతం అనిశ్చితంగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్ న్రం గారెడ్డి జిల్లా షాద్‌నగర్ డివిజన్ పరిధిలోని ఫరూఖ్‌నగర్ మండలం వెల్జర్ల గ్రామ రైతు వేదికలో నిర్వహిస్తున్న విత్తన మేళాను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి వ్యవసాయ పరిస్థితులు, పంటల సాగు, వర్షాభావ పరిస్థితులపై ఆరా తీశారు.ప్రస్తుతం సూచించారు. ముఖ్యంగా పాడి రైతులు పశుగ్రాస అవసరాల కోసం జొన్న సాగు చేపట్టాలని తెలిపారు. అలాగే నగరానికి సమీప ప్రాంతాల్లోని రైతులు కూరగాయల సాగు చేపట్టడం ద్వారా మెరుగైన ఆదాయం పొందవచ్చని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రైతు వేదికల్లో కందులు, పెసలు, మినుములు, కూరగాయల విత్తనాలు, మేత జొన్న విత్తనాలు తదితర నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచిందని తెలిపారు. ఈ విత్తన మేళ 27-07-2026 నుండి 29-07-2026 వరకు రైతులకు అందుబాటులో ఉంటుంది రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ప్రాంత పరిస్థితులకు అనుకూలమైన పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. అనంతరం వెల్జర్ల గ్రామంలోని పొలాలను సందర్శించిన వ్యవసాయ శాఖ కార్యదర్శి రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి సాగు పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పిడి చేపట్టి లాభదాయక వ్యవసాయం వైపు అడుగులు వేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు.
రైతు నేస్తం 100వ ఎపిసోడ్ ను సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు నేస్తం కార్యక్రమం రేపు (28 జూలై 2026) 100వ ఎపిసోడ్‌కు చేరుకోనుంది. రైతులకు అవసరమైన సాంకేతిక సమాచారం నేరుగా చేరవేసే సమర్థవంతమైన వేదికగా రైతు నేస్తం విశేష ఆదరణ పొందిందని వ్యవసాయ సంచాలకుడు బి.గోపి తెలిపారు. 100వ ఎపిసోడ్ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలలో కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నందున రైతులందరూ తమ సమీప రైతు వేదికకు హాజరై శాస్త్రవేత్తల సూచనలు, సలహాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





