నీ క‌ల నెర‌వేరిందా రాహుల్‌?

– పోలీస్ కావాలన్న కలను నిజం చేసిన మల్కాజిగిరి సీపీ సుమతి
– తన కుర్చీలో కూర్చోబెట్టి పోలీస్ టోపీ పెట్టిన వైనం
– దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరూ దయ చూపాల : సుమతి

మేడ్చల్/దమ్మాయిగూడ, ప్రజాతంత్ర, జూలై 27: పుట్టుకతోనే అంగవైకల్యంతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న దమ్మాయిగూడకు చెందిన రాహుల్ చిరకాల కోరికను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి నెరవేర్చారు. సమాజంలో పోలీసు కరకుతనాన్ని కాకుండా వారిలోని కరుణను చాటిచెప్పే అద్భుత ఘట్టానికి మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ వేదికైంది. ఒక రోజైనా పోలీస్ అధికారిగా కుర్చీలో కూర్చోవాలని కలలు కన్న రాహుల్ ను కమిషనరేట్ ప్రధాన కార్యాలయానికి సీపీ సుమతి ఆహ్వానించి తన కుర్చీలో కూర్చోబెట్టి పోలీస్ టోపీ ధరింపజేశారు. నీ కోరిక తీరిందా రాహుల్ అంటూ ఆప్యాయంగా పలకరించగా చిరునవ్వులు చిందించిన రాహుల్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి వలస వచ్చిన తిరుమలరావు-రాధమ్మ దంపతుల కుమారుడు రాహుల్ పుట్టుకతోనే వైకల్యంతో బాధపడుతున్నాడు. రెండు కాళ్లు ఉన్నప్పటికీ నడవలేని పరిస్థితి, మాటలు కూడా సరిగా రాని స్థితిలో ఉండటంతో కుటుంబానికి భారంగా మారాడు. ఈ విషయాన్ని తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు శివకృష్ణ, ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ ర ష్మిత దృష్టికి తీసుకెళ్లగా రాహుల్ కు వీల్ చైర్ అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. రాహుల్ కోరిక నెరవేరడంతో అతని తల్లిదండ్రులు సీపీ సుమతి, ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ రష్మిత, మెరుగు శివకృష్ణలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

స్వచ్ఛంద సంస్థలు అంకితభావంతో పనిచేయాలి : సీపీ సుమతి

స్వచ్ఛంద సంస్థలు పేదల కోసం అంకితభావంతో పనిచేసినప్పుడే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉండిపోతారని నిస్వా ర్ధంగా ప్రజలకు సేవలు అందించాలని కమిషనర్ సుమతి స్వచ్ఛంద సంస్థల నేతలతో అన్నారు. స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్ర మాలను వికలాంగులను అంగవిక‌లుర‌ను, మూగ చెవిటి వారిని ఆప్యాయంగా పలకరించి సోదర భావంతో మెలగాలని కోరారు. సీనియర్ జర్నలిస్ట్ దామరపల్లి నర్సింహారెడ్డి, చింతల విజయ్ కుమార్, జినుక రఘు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *