– మూడ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం
హైదారాబాద్, ప్రజాతంత్ర, జూలై 29 : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర ఒడిశా, గంగానది పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై కేంద్రీకృతమై పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో మూడ్రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొంది. అటు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో మెదక్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసినట్టు చెప్పారు. ములుగు జిల్లా ఏటూరునాగారంలో అత్యధికంగా 9.64 సెం.మీ, మెదక్ జిల్లా చేగుంటలో 8.11 సెం.మీ, మెదక్‌లో 7.68 సెం.మీ, శంకరంపేటలో 6.71 సెం.మీ, జయశంకర్‌భూపాలపల్లి జిల్లా పాలెంలలో 6.90 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 6.14 సెం.మీ చొప్ప్పున వర్షపాతం నమోదైనట్టు వివరించారు. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, గురు, శుక్రవారాల్లోనూ బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఎల్ నినో కారణంగా జూన్, జూలైలో -49 సెం.మీ లోటు వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ గణాంకాలు వెల్లడించాయి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు
నిజామాబాద్ : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకల్లోకి వరద పెరుగుతోంది. సిరికొండ మండలంలో కప్పల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బ్రిడ్జి వద్ద వరద ప్రవాహానికి అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. భారీ వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. గత 24 గంటల్లో ప్రాజెక్టులోకి 6585 క్యూసెక్కుల వరద నీరు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు, 17.802 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1395.40 అడుగులు, 7.139 టీఎంసీలుగా నమోదైంది. గత ఏడాది ఇదే రోజు ప్రాజెక్టులో నీటిమట్టం 1391.25 అడుగులు, 4.597 టీఎంసీలుగా ఉన్న విషయం తెలిసిందే. అటు మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లోలో 27,000 క్యూసెక్కులు, ఔవుట్ ఫ్లోలో 28,000 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 విÖటర్లకు గాను ప్రస్తుత నీటి మట్టం 317.240 విÖటర్లకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 7.17 టీఎంసీలుగా నమోదైంది. వరద ప్రవాహం నేపథ్యంలో ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో పది యÖనిట్లలో 395 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





