– ఐదు జిల్లాలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
హైదరాబాద్ ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : వినాయక నిమజ్జనం సందర్భంగా ఈనెల 25న సెలవు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం వినాయన నిమజ్జనాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగరాలతోపాటు రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని ప్రభుత్వ కార్యాల యాలు, పాఠశాలలు, కళాశాలలకు ప్రభు త్వం సాధారణ సెలవు ప్రకటించింది. ఈ సెలవుకు బదులుగా నవంబర్ 14న పని దినంగా పరిగణించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





