– విద్యార్థుల నిరసనలపై లోక్‌సభలో రాహుల్
– పేపర్ లీక్‌పై బీజేపీ ఎంపీల పిల్లలనే అడగండి చెబుతారు
– యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చలో విమర్శలు
– రాహుల్ వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎంపీల ఆగ్రహం
న్యూదిల్లీ, జూలై 29 : పోటీ పరీక్షలలో అక్రమాల నిరోధానికి చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై లోక్‌సభలో బుధవారం కూడా వాడీవేడి చర్చ కొనసాగింది. విద్యార్థుల ఆందోళనపై ప్రసంగించిన విపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరఎసఎస్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సమయంలో ఆయన ఉపయోగించిన ఓ పదంపై తీవ్ర దుమారం రేగింది. యువత ఆందోళనను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారు.. వారి సెంటిమెంట్‌ను అన్ని పార్టీలు గౌరవించాయి.. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఉన్న విద్యార్థులు పేపర్ లీక్ వంటి ఘటనలతో ఆందోళనకు గురయ్యారు.. తీవ్ర వేదన తర్వాతే దిల్లీ వేదికగా నిరసనలు చేపట్టారు.. శాంతియుత నిరసన చేస్తున్న వారిని రెచ్చగొట్టేలా పోలీసులు ప్రవర్తించారు.. ఆందోళన చేసిన వారితో తాను మాట్లాడగా వారు చెప్పిన మాటలు తనను కదిలించాయి. మÖర్ఖులు ఎవరి మాటలు వినరని విద్యార్థులు తనతో చెప్పార’ని రాహుల్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఉన్నవాళ్లు తమ ఆవేదనను పట్టించుకోవడం లేదని యువత బాధపడినట్లు రాహుల్ వ్యాఖ్యానించారు. సభలో రాహుల్ అభ్యంతరకర మాటలు మాట్లాడుతున్నారని, విద్యార్థుల పేరు చెప్పి ఎంపీలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. వాటిని రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో కేంద్రం, విపక్ష నేత మధ్య ఒకింత వాగ్వాదం నెలకొంది. దీంతో స్పీకర్ దాన్ని తొలగించారు. రాహుల్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ చదువు అనేది ప్రస్తుతం ఖరీదైన వ్యాపారంగా మారిందని, విద్యార్థుల కోసం నేడు తల్లిదండ్రులు లక్షలు ఖర్చుపెడుతున్నా విద్యావ్యవస్థ క్రూరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పైవేటీకరణ విచ్చలవిడిగా జరుగుతోందని, ఈ వ్యవస్థ నడిపిస్తోంది ఆరఎసఎస్. ధర్మేంద్ర ప్రధాన్ సింబల్ మాత్రవేనని, విద్యార్థులకు అసలైన శత్రువు ఈ సంస్థేనని అన్నారు. ఆరఎసఎస్ నుంచి వచ్చిన వాళ్లకే ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉంటోంది.. ఆఖరికు వర్సిటీల్లోనూ ఆరఎసఎస్ నుంచి వచ్చిన వాళ్లనే వీసీలుగా నియమించారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను కూడా అధికార సభ్యులు తీవ్రంగా ఖండించారు. అనంతరం విద్యార్థులపై పోలీసుల చర్యను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఎందుకు ప్రయోగించారని ప్రశ్నిస్తూ ఆందోళనకారులను అణచివేయాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారని ఆరోపించారు. సభకు రావడానికి హోంమంత్రికి ధైర్యం లేదంటూ విమర్శించారు. దీంతో సభలో మరోసారి గందరగోళం నెలకొంది. రాహుల్ గాంధీ ఇలాంటి ఆరోపణలు ఎలా చేస్తున్నారు? అమిత్ షా పేరును ప్రస్తావించేందుకు ఆయన వద్ద ఏం ఆధారాలున్నాయి? రాహుల్ తన భాషను మార్చుకోవాలని, రాహుల్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని హోంమంత్రికి క్షమాపణలు చెప్పాలని మంత్రి కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. విద్యార్థుల పేరుతో అన్‌పార్లమెంటరీ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. పేపర్ లీక్‌పై ఏం జరిగిందో తెలుసుకోవాలంటే బీజేపీ నేతలు, వారి పిల్లలను అడగాలంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. దిల్లీ వీధుల్లో జరిగింది నిరసన కాదని.. భావ వ్యక్తీకరణ అని అన్నారు. విద్యార్థుల ఆందోళనను రాజకీయాలకతీతంగా అన్ని పార్టీలు గౌరవించాలని పిలుపునిచ్చారు. తీవ్ర వేదన తర్వాతే విద్యార్థులు ఆందోళన చేశారని, కానీ వారి నిరసనను కేంద్రం అర్థం చేసుకోలేదని విమర్శించారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులను రెచ్చగొట్టేలా పోలీసులు ప్రవర్తించారని, వారిపై పోలీసులు లాఠీచార్జి చేసి హింసించారని మండిపడ్డారు. పేపర్ లీక్ వార్తతో విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురయ్యారరంటూ వారి ఆవేదనను అర్థం చేసుకున్నందునే వారి పక్షాన మాట్లాడుతున్నట్లు రాహుల్ గాంధీ చెప్పారు. బీజేపీ ఎంపీల వ్యాఖ్యలపై రాహుల్ మాట్లాడుతూ ’నేను ఎంపీలను విమర్శించలేదు. బీజేపీ ఎంపీలు కావాలనే నా ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారు. సభలో కేవలం బీజేపీ ఎంపీలే మాట్లాడాలనడం సరికాదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





