– సెల్ఫీ వీడియో తీసుకుని వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 29 : భార్య, అత్తామామల వేధింపులతో ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అంబర్‌పేట్ డివిజన్ ఉమర్ నగర్‌లో సుల్తాన్(44) అనే వ్యక్తి పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య అస్మా ఫరిన్, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతడి అత్త, మామ నిజామాబాద్‌లో ఉంటారు. కుమార్తె పేరు విÖద పోస్టాఫీలో వేస్తున్నానంటే ప్రతినెలా రూ.5 నుంచి రూ.6 వేలు తన భార్యకు ఇస్తున్నట్లు ఆ వీడియోలో తెలిపాడు. కుమార్తె పేరు విÖద డబ్బులు వేస్తున్నానని భార్య చెప్పడంతో నమ్మానని, అయితే పోస్టాఫీసుకి వెళ్లి చూడగా కుమార్తె అకౌంట్లో రూ.6 వేలు మాత్రమే ఉన్నాయని సుల్తాన్ పేర్కొన్నాడు. అలాగే నిజామాబాద్‌లో స్థలం కొనమని అత్తమామలకు రూ.3 లక్షలు ఇవ్వగా వారు స్థలం కొనకుండా మోసం చేశారని ఆరోపించాడు. పండ్ల వ్యాపారంలో రూ.20 నుంచి రూ.25 లక్షలు సంపాదించి తన భార్యకు ఇవ్వగా ఆమె డబ్బులు లేవని చెబుతోందని వాపోయాడు. పైగా ఆమెకు అక్రమ సంబంధాలు ఉన్నాయని సెల్ఫీ వీడియోలో తెలిపాడు. డబ్బులు అడిగితే ఫరీన్, ఆమె తల్లిదండ్రులు తనను మానసికంగా వేధిస్తున్నారని, వారి వేదన భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపాడు. తన డబ్బులను పిల్లల పేరు విÖద ఉంచాలని సుల్తాన్ వీడియోలో కోరాడు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు


