గణేష్ నిమజ్జనం ముగిసింది.. జ్ఞానేష్ నిమజ్జనం మిగిలి ఉంది

– సీఈసీ రాజీనామాపై ప్రకాష్ రాజ్

బెంగళూరు, అక్టోబర్ 2 : సీఈసీ జ్ఞానేష్ కుమార్  తొలగించాలంటూ ప్రతిపక్షాల డిమాండ్ పై సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. దేశంలో గణేష్ నిమజ్జనం పూర్తైందని, జ్ఞానేష్ నిమజ్జనం మిగిలి ఉందని అన్నారు. ‘సర్’ కు వ్యతిరేకంగా, అలాగే, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ తొ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ సహా వివిధ పక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఢిల్లీలో, ఆ తర్వాత ముంబైలో భారీ నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు భారీ ఎత్తున ఈ ఆందోళనల్లో పాల్గొనాలని ప్రకాష్ రాజ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో రిలీజ్ చేశారు. సీఈసీని తొలగించే వరకు జరిగే ఆందోళనలకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. సీఈసీ రాజీనామా కోరుతూ సీజేపీ కూడా ఆందోళన చేపట్టనున్న సంగతి తెలిసిందే. దీనిపై కూడా ప్రకాష్ రాజ్ స్పందించారు. కాక్రోచ్‌లు వస్తున్నారు.. హ్యాపీ జయంతి అంటూ చెప్పుకొచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *