రాష్ట్రంలో భారీగా పెరిగిన ఆటో ఛార్జీలు

– కిలోమీటర్‌కు రూ.15 చొప్పున పెంపు
– తొలి 1.6 కిలోమీటర్లకు కనీస ఛార్జీ రూ.30
– పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి
– లగేజీపై కూడా అదనపు చార్జీలకు అనుమతి
– జీవో జారీ చేసిన ప్రభుత్వం

హైదారాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 2: ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఊరట కల్పించింది. ఆటో ఛార్జీలను ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు రేవంత్‌ ‌సర్కార్‌ శుక్రవారం జీవో జారీ చేసింది. కనీస చార్జీని రూ.20 నుంచి రూ.30కి పెంచుతున్నట్లు జజీవోలో పొందుపర్చింది. ప్రతీ కిలోమీటర్‌కు రూ.11 నుంచి రూ.14కి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇక టిటెన్షన్‌ ‌చార్జి 50 పైసల నుంచి 75 పైసలకు పెంచగా.. లగేజీ ఛార్జీ 25 పైసల నుంచి 50 పైసలకు పెంచారు. ఇక గరిష్ట లగేజీ పరిమితి 100 కిలోలుగా కొనసాగించారు. ఇక రాత్రి సమయాల్లో ఛార్జీలపై 1.5 రెట్లు కొనసాగించారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆటో ఛార్జీలను ప్రభుత్వం సవరించింది.కొత్త ఆటో ఛార్జీల అమలు కోసం మీటర్ల రీసెట్టింగ్‌కు ప్రభుత్వం 3 నెలల గడువు విధించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఒకటిన్నర శాతం అదనపు ఛార్జీలు వసూలు చేసుకునేలా వెసులుబాటు కల్పించింది. మూడు నెలల్లోగా ఆటో డ్రైవర్లు డిజిటల్‌ ‌మీటర్లను ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆటో ఛార్జీలను అధికారికంగా ధృవీకరిస్తూ జీ.ఒ. 46 జారీ చేసింది. ఈ చార్జీలు తక్షణమే అమల్లో వస్తాయని వెల్లడించింది. ఇక ట్రాఫిక్‌ ‌లేదా ఇతర కారణాల వల్ల ఆటో ఆగినప్పుడు నిమిషానికి 75 పైసలు చొప్పున వెయిటింగ్‌ ‌ఛార్జీ ఖరారు చేశారు. రాత్రి సమయాల్లో ప్రయాణించేవారు సాధారణ ఛార్జీల కంటే అదనంగా 50 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఇక ప్రయాణికులు ఆటోలో తమ వెంట హ్యాండ్‌ ‌బ్యాగ్‌, ‌బ్రీఫ్‌ ‌కేస్‌ ‌వంటికి ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ఇతర పెద్ద లగేజీలు తీసుకెళ్లాలంటే కిలోమీటర్‌కు 50 పైసలు చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.ఆటోలో తొలి 1.6 కిలోమీటర్లకు కనీస ఛార్జీ రూ.30గా ఫిక్స్ ‌చేశారు. ఆ తర్వాత ప్రతీ అదనపు కిలోమీటర్‌కు రూ.15 చొప్పున ఖరారు చేశారు. ఇక కొత్త ధరలపై ఆటోల్లో ఫేర్‌ ‌కార్డులను ఏర్పాటు చేయాలని డ్రైవర్లను ప్రభుత్వం ఆదేశించింది. కాగా ఆటో ఛార్జీలను పెంచాలని డ్రైవర్ల సంఘాలు ఇటీవల సమ్మెకు పిలుపునిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆటోలను నిలిపివేసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం దిగొచ్చి ఆటో సంఘాలతో చర్చలు జరిపింది. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడంతో ఆటో డ్రైవర్లు సమ్మెపై వెనక్కి తగ్గారు. ఈ క్రమంలో ఆటో ఛార్జీలను ప్రభుత్వం పెంచింది. అలాగే డ్రైవర్ల సంక్షేమ కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసే పనిలో ప్రభుత్వం ఉంది. అయితే ఛార్జీల పెంపు వల్ల డ్రైవర్లకు ప్రయోజనం చేకూరనుండగా సామాన్యులకు భారమనే చెప్పుకోవచ్చు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *