డీజీపీ కార్యాలయంలో వీరనారి ఐలమ్మ జయంతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను డీజీపీ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి డీజీ (లా అండ్ ఆర్డర్) మహేశ్ భగవత్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. పోలీసు అధికారులు, సిబ్బంది వీరనారి చాకలి ఐలమ్మ సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె పోషించిన ధైర్యసాహసపూరిత పాత్రను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఐజి అడ్మిన్ జె. అన్యోన్య, స్టోర్స్ డీఎస్పీ సత్యనారాయణ, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ యోగేశ్వరరావు, సీఏవోలు, సూపరింటెండెంట్లతోపాటు ఇతర అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *