హైడ్రా రంగనాథ్‌కు హైకోర్టులో ఊరట

– సింగిల్ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కేసులో ఆయనపై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్‌ను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. తదుపరి విచారణ నవంబర్ 3వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. అప్పటివరకు రంగనాథ్‌ని మార్చాలనే సింగిల్ బెంచ్ ఆర్డర్‌ను తాత్కాలికంగా డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. తదుపరి ఆదేశాల వరకు లోతుకుంటా భూముల జోలికి వెళ్లవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తరఫున హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు మాజీ సీజే జస్టిస్ రాజీవ్ శక్దర్ వాదనలు వినిపించారు. శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కేసుపై హైడ్రా కమిషనర్ అప్పీల్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసులో రంగనాథ్‌ను తప్పించి మరో అధికారిని నియమించాలని సింగిల్ జడ్జి గతంలో తీర్పునిచ్చారు. ఈ క్రమంలోనే సింగిల్ జడ్జి తీర్పుని హైడ్రా కమిషనర్ రంగనాథ్ డివిజన్ బెంచ్‌లో సవాల్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *