– రాష్ట్రంలో అన్ని గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్
– పర్యావరణహిత వేడుకలకు ప్రాధాన్యం
– రక్షణ, పారిశుద్ధ్యం, వైద్యసేవలు నిరంతరం అందుబాటులో వుండాలి
– సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలి
– రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: గణేష్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత శోభాయమానంగా నిర్వహిస్తామని రవాణా బీసీ సంక్షేమ శాఖ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. వచ్చే గణేష్ నవరాత్రి ఉత్సవాలను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో ఘనంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కలసి పనిచేయాలని సంబంధిత శాఖల ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో గణేష్ ఉత్సవ వేడుకలు-2026 ఉన్నతస్థాయి సన్నాహక సమన్వయ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తోందని, మండపాల నిర్వాహకులు నిర్దేశిత విధానంలో దరఖాస్తు చేసుకుని ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో సుమారు 47 సంవత్సరాలుగా కొనసాగుతున్న గణేష్ ఉత్సవాల సంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకుని గత అనుభవాల్లో ఎదురైన సమస్యలు, లోపాలను ముందుగానే గుర్తించి ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, ఉత్సవాలు, నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తం గా ఉండాలని సూచించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. షీ టీమ్స్, యాంటీ-థెఫ్ట్ నిఘా బృందాలను వినియోగించడంతోపాటు శాంతిభద్రతలు, మత సామరస్యాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించి పార్కింగ్ ప్రదేశాలు, ట్రాఫిక్ మళ్లింపులు, ట్రాఫిక్ వాలంటీర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మున్సిపల్ శాఖలు 24 గంటలపాటు పారిశుధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, రోడ్డు మరమ్మతులు చేపట్టాలని, వీధి దీపాలను సక్రమంగా నిర్వహించాలని, బేబీ పాండ్ల నిర్మాణం, నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. ఫాగింగ్, బయో టాయిలెట్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కొత్తగా ప్రారంభించిన మున్సిపల్ కార్పొరేషన్ల లోగోలను విస్తృతంగా ప్రదర్శించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కీలక ప్రాంతాల్లో 24 గంటల వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలతోపాటు ప్రథమ చికిత్స సామగ్రి, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, అంబులెన్సులు, షిఫ్ట్‌ల వారీగా వైద్య బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ మౌలిక వసతులను ముందస్తుగా తనిఖీ చేసి విద్యుత్ భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకుని, ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.
రవాణా శాఖ, టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉన్న బస్సులను మాత్రమే వినియోగించాలని, భక్తుల రద్దీకి అనుగుణంగా దాదాపు 700 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని ఆదేశించారు. ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని అవసరమైన మార్గ మళ్లింపులు చేపట్టాలని, మొబైల్ బ్రేక్‌డౌన్ రిలీఫ్ వాహనాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. హైదరాబాద్ మెట్రో రైల్ సేవలను అవసరానికి అనుగుణంగా పొడిగించాలని, రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచాలని, ప్రయాణికులకు ముందస్తు సమాచారం అందించాలని, స్టేషన్లలో స్పష్టమైన సూచికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖలు నిమజ్జన ప్రాంతాల్లో శిక్షణ పొందిన గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని మంత్రి ఆదేశించారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో అవసరమైన ప్రాంతాల్లో లైఫ్‌బోట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ బేబీ పాండ్లలో పూడిక తొలగింపు పనులు చేపట్టి నీటి నాణ్యతను, ఇతర అవసరమైన ఏర్పాట్లను నిర్ధారించాలని ఆదేశించారు. ఎండోమెంట్స్, సాంస్కృతిక, సమాచార పౌర సంబంధాల శాఖలు మట్టి విగ్రహాలు, గణేష్ ఉత్సవాల ప్రచురణలు చేపట్టి ప్రజలలో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. నిర్దేశించిన ప్రాంతాల్లో సాంస్కృతిక బృందాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలని, ఉత్సవాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణహిత మట్టి విగ్రహాల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు నిర్వహించాలని మంత్రి సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు డీజేల వినియోగంపై ఉన్న నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, శాంతిభద్రతలు, ప్రజా భద్రత, మత సామరస్యాన్ని కాపాడేందుకు అధికారులు, నిర్వాహకులకు పరస్పర సహకారం అలాగే అందరి భాగస్వామ్యం ఎంతో అవసరమని అన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించాలని, ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి శాఖల మధ్య సమన్వయంతో సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. ముందస్తు ప్రణాళిక, సమర్థవంతమైన సమన్వయం, సకాలంలో సమస్యల పరిష్కారంతో గణేష్ ఉత్సవాలు విజయవంతంగా జరిగేలా చూడాలని సూచించా రు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్ యాదవ్, రఘువీర్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి; డీజీపీ సీవీ ఆనంద్, ఏడీజీపీ మహేష్ భగవత్, పోలీస్ కమిషనర్లు సజ్జనార్, రమేష్, సుమతి, జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయెల్ డేవిస్, సర్ఫరాజ్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్లు కర్ణన్, సృజన, వినయ్ కృష్ణారెడ్డి; హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా, రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎండోమెంట్స్ కమిషనర్ హనుమంతరావు, ఆరోగ్య శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ, టూరిజం ఎండీ గౌతమి, టీజీఎస్‌పీడీసీఎల్ ఎండీ జితేష్ పాటిల్, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ జాయింట్ ఎండీ మయాంక్ మిట్టల్, సాంస్కృతిక శాఖ సంచాలకులు నరసింహారెడ్డి, ఐ&పీఆర్ అదనపు సంచాలకుడు డి.ఎస్.జగన్, ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజనీర్ రాజేశ్వర్ రెడ్డి, జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ వెంకటరమణ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవరెడ్డి కార్యదర్శి శశిధర్ రెడ్డి, సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

—————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు