– ధరలు మోత మోగిస్తుంటే వృద్ధి ఎలా సాధ్యం
– ప్రధాని వ్యాఖ్యలపై మండిపడ్డ జైరామ్ రమేశ్
న్యూదిల్లీ, సెప్టెంబర్ 1 : దేశ జీడీపీ 7.8 శాతం మేర వృద్ధి సాధించిందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ విమర్శలు గుప్పించారు. అవన్నీ ప్రచారార్భాటమేనని కొట్టిపారేశారు. గణంకాల గారడీతో మోదీ ప్రభుత్వం ప్రజలను భ్రమల్లో ముంచెత్తుతోందని ఆరోపించారు. దేశంలో పెట్టుబడులు, వినియోగం మందగించాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ’హై వోల్టేజి’ ధరల భారాన్ని సామాన్యులపై మోపుతోందని రమేష్ ఆరోపించారు. ముడిసరకుల ధరలు పెరగడంతో సామాన్యుల సొంతింటి కలలు కల్లలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధరాభారం కేవలం వంటింటికే పరిమితం కాలేదన్నారు. రాగి వైర్ ధర రూ.850 నుంచి రూ.1,700కి, అల్యూమినియం ధర రూ.350 నుంచి రూ.650కి చేరిందని వెల్లడించారు. వెయ్యి చదరపు అడుగుల ఇంటికి వైరింగ్ ఖర్చు రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెరిగిందని తెలిపారు. హోమ్ అప్లయన్సెస్, ఎల్‌ఈడీ లైట్లు, ఫ్యాన్లు, సోలార్ ప్యానెళ్ల ధరలు 10 నుంచి 20 శాతం వరకు పెరిగాయన్నారు. స్విచ్ సాకెట్లు, మెయిన్ లైన్ కేబుల్స్, టైల్స్, కార్మికుల ఖర్చు ఇలా అన్నీ పెరిగాయని అన్నారు. ధరాభారం అన్ని వైపుల నుంచి ప్రజలకు షాకులిస్తోందని వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం మాత్రం వాస్తవాలను మరుగునపరిచి గణాంకాలతో ప్రజలను తప్ప్పుదారి పట్టిస్తోందని మండిపడ్డారు. త్రైమాసిక జీడీపీ గణాంకాలు దేశంలోని పరిస్థితుల్ని తప్పుగా చూపిస్తున్నాయన్నారు. వీక్ సెంటిమెంట్‌ను ప్రతిఫలించట్లేదన్నారు. ఏప్రిల్-జూన్ తైమాసికంలో భారత జీడీపీ 7.8 శాతం వృద్ధి సాధించడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





