– ఎంపీలపై అభాండాలు వేయడం సరికాదు
‘- ఎంపవర్డ్’ సంస్థ నివేదికపై కేంద్ర మంత్రి బండి
కరీంనగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : ఎంపీ ల్యాడ్స్ నిధుల వినియోగంపై దుష్ప్రచారాలు తగవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎంపవర్డ్ ఇండియన్ సంస్థ విడుదల చేసిన నివేదికపై ఆయన స్పందించారు. కేంద్రం ఏటా కేటాయిస్తున్న ఎంపీ ల్యాడ్స్ నిధులను వినియోగించుకోవడంలో పార్లమెంటు సభ్యులు పూర్తిగా వెనుకబడ్డారన్న ఆ సంస్థ నివేదిక సత్యదూరమని అన్నారు. ఎంపీ ల్యాడ్స్ కింద పంపిన ప్రతిపాదనలకు సంబంధించి పనుల పురోగతి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా అభాండాలు వేయడం సరికాదన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ నియోజకవర్గానికి ఎంపీ ల్యాడ్స్ కింద రూ.17.50 కోట్లు కేటాయించగా అందులో ఇప్పటికే రూ.16.47 కోట్లు వినియోగించామని సంజjáYT స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన వివరాలను గణాంకాలతో విÖడియాకు వివరించారు. ‘కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి గత మÖడేళ్లలో కమÖ్యనిటీ హాళ్లు, బోర్‌వెల్స్, హైమాస్ట్ లైట్లు, సీసీ రోడ్ల నిర్మాణాల కోసం ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు 627 ప్రతిపాదనలు కలెక్టర్‌కు పంపాం.. ఇందులో కరీంనగర్ జిల్లా నుంచి 313, హన్మకొండ నుంచి 39, జగిత్యాల నుంచి 45, రాజన్న సిరిసిల్ల నుంచి 151, సిద్దిపేట నుంచి 79 పనులకు సంబంధించిన ప్రతిపాదనలున్నాయి.. వీటిలో 82.29 శాతం పనులకు ఆయా కలెక్టర్లు ఆమోదం తెలిపారు.. మిగిలిన పనుల మంజూరు అంశం ప్రాసెస్‌లో ఉంది.. మొత్తంగా కేంద్రం కేటాయించిన రూ.17.5 కోట్లలో 94.1 శాతం మేరకు అంటే రూ.16.47 కోట్ల నిధులకు సంబంధించిన పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి’ అని కేంద్ర మంత్రి వివరించారు. ఇందులో 16వ లోక్‌సభ సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్ తన ఐదేళ్ల కాలంలో వినియోగించని రూ.2.5 కోట్లను సైతం తాను ఖర్చు చేసినట్లు తెలిపారు. వాస్తవానికి ఎంపీ ల్యాడ్స్ నిధులు సరిపోవడం లేదంటూ ఆ నిధులను ఏటా పెంచాలని కోరుతూ ఇప్పటికే ఎంపీల నుంచి కేంద్రానికి అనేక విజ్ఞప్తులు వెళ్తున్నాయని తెలిపారు. అయినప్పటికీ ఎంపీ ల్యాడ్స్ నిధులే ఖర్చు చేయడం లేదంటూ ‘ఎంపవర్డ’ సంస్థ ప్రచారం చేయడం అన్యాయమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో ఏడు నెలల సమయం ఉన్నప్పటికీ తన వద్ద ఆ నిధులు మిగలలేదని, ఆ నిధులకు సంబంధించిన ప్రతిపాదనలన్నీ సంబంధిత కలెక్టర్లకు పంపామని వివరించారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం అవసరమైన నిధుల కోసం సీఎసఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ఫండ్స్‌ను కూడా సేకరిస్తున్నామనే విషయాన్ని ఆ సంస్థ గుర్తుంచుకోవాల న్నారు. ఇకనైనా ఎంపీ ల్యాడ్స్ నిధులకు సంబంధించి నగదు కేటాయింపు, ఎంపీల ప్రతిపాదనలు, కలెక్టర్ల ఆమోదం, వివిధ శాఖల అధికారుల కార్యాచరణ, అమలు, పనుల పూర్తి వరకు దశలవారీగా వాస్తవాలను ఆ సంస్థ పరిగణనలోకి తీసుకుని వాటిని ప్రజల ముందుంచాలని సంజయ్ కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




