దీపావళి కానుక.. 4.5 లక్షల మందికి కొత్తగా పింఛన్లు

– రేపు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన మరో 4.5 లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్లు అందించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నియోజకవర్గమైన కొడంగల్‌లో నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క పాల్గొననున్నారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేత కార్మికులు, గీత కార్మికులు తదితర వర్గాల్లోని అర్హులైన వారికి కొత్తగా పింఛన్లు మంజూరు చేయనున్నారు. కొడంగల్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కొంతమంది నూతన లబ్దిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలను అందజేస్తారు. అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల చేతుల మీదుగా అర్హులైన వారికి మంజూరు పత్రాలను పంపిణీ చేస్తారు. కొత్తగా పింఛన్లు మంజూరైన వారందరికీ ఈ నెల నుంచే పింఛను మొత్తాన్ని అందించనున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *