తొలి కోడి కూతతో లేచి ఇంట్లో పనులని
చక్కపెడుతూ పిల్లలను స్కూల్ కి రేడి చేస్తూ
శ్రీవారు ఆఫీస్ కి వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తూ
అత్త మామకు టైంకీ టీ టిఫిన్ పెడుతూ….
కుటుంబ బాధ్యతలు మోసే రెండవ వ్యక్తి
భార్య భర్తకు తోడు నీడగా ఉంటూ
అమ్మగా, కోడలిగా విధులు నిర్వర్తిస్తూ
ఇంటికి వచ్చే బంధు మిత్రులను గౌరవిస్తూ
యంత్రంలా వంటగదిలో వారికి కావాల్సిన
స్వీట్లు పిండి పదార్ధాలు చేసి పెడుతూ…
రోజంతా ఇంట్లో పనులతో బీజీగా
గడుపుతూ ఇంటిని చక్క పెడుతూ
పిల్లల చదువుతో పాటు యోగ క్షేమాలు
చూసుకుంటూ ఇల్లాలి పాత్ర పోషిస్తూ….
అమ్మ పిల్లల లక్ష్యములే తన ఆశయాలుగా
పిల్లల కోరికలే తన ఇష్టాలుగా అత్తమామ
విలువలే తన సిద్దాంతాలుగా భర్త కుటుంబ
బాధ్యతలో కష్ట సుఖాలలో పతికి తోడుంటూ
కుటుంబం కోసం జీవితాన్నే త్యాగం చేస్తూ
మంచి ఇల్లాలుగా జీవనం సాగిస్తుంది.
– మిద్దె సురేష్
కవి, వ్యాసకర్త
9701209355





