భారీ వర్షం పడుతోంది.. అప్రమత్తంగా ఉండాలి

– అధికారులకు సీఎం ఆదేశాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : నగరంలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, హైడ్రా, పోలీసు కమిషనర్లు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ప్రధాన రహదారులు, జంక్షన్లు, కాలనీల్లో వర్షపు నీరు నిలిచిపోకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో వెంటనే సిబ్బంది, యంత్రాలను రంగంలోకి దించాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని, ట్రాఫిక్ నిలిచిపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. నాలాలు, డ్రైనేజీల్లో నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని, కంట్రోల్ రూమ్‌లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉంటూ పరిస్థితిని పర్యవేక్షించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *