– అధికారులకు సీఈవో సుదర్శన్ రెడ్డి ఆదేశాలు
మేడ్చల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : ఈవీఎం, ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీప్యాట్) భద్రపరిచిన గోదామును వివిధŠ పార్టీల ప్రతినిధులు, అదనపు ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) సి.సుదర్శన్ రెడ్డి తనిఖీ చేశారు. అనంతరం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎసఐఆర్) నోటీసుల హియరింగ్ ప్రక్రియలో భాగంగా గురువారం నర్సశీపల్లి, కీసర మండలం, మునీరాబాద్, మేడ్చల్ మండలం దొమ్మర పోచంపల్లి, దుండిగల్ మండలం ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఎసఐఆర్ హియరింగ్ ప్రక్రియను సీఈవో, జిల్లా ఎన్నికల అధికారి పరి శీలించారు. ఓటును నిర్దారించే ప్రక్రియ, ఎన్నికల సంఘం నిర్దారించిన ధ్రువీకరణ పత్రాల సమర్పణ, క్షేత్రస్థాయి సహాయం, రికార్డుల పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎసఐఆర్) హియరింగ్ ప్రక్రియను నిబంధనల మేరకు పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలను, సూపర్‌వైజర్లను, బీఎల్‌వోలను సీఈవో ఆదేశించారు. జిల్లాలో మ్యాపింగ్ జరగకుండా ఉన్న ఓటర్లు, ఓటర కార్డులో ఉన్న వ్యత్యాసాల కేటగిరీలకు సంబంధించిన రికార్డులు, దరఖాస్తుల ధ్రువీకరణను పకడ్బందీగా చేపట్టాలని, నోటీసు అందిన ఓటర్లు హియరింగ్‌కు హాజరయ్యే అభ్యర్థుల వివరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి అవసరమైన ఆధారాలను ధ్రువీకరించాకనే తదుపరి చర్యలు చేపట్టా లని సూచించారు. అర్హత కలిగిన ఓటర్ల వివరాలు క్రమపద్ధతిలో నమోదయ్యేలా, సంబంధిత పత్రాల పరిశీలన లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. గడువులోగా ప్రక్రియ పూర్తికి తగినంత సిబ్బందిని నియమించి రోజువారీ లక్ష్యాలు, ప్రామాణిక విధానాలు, సమగ్ర కార్యాచరణతో పనులను కొనసాగించాలని సూచించారు. హియరింగ్ నిర్వహణ, దరఖాస్తుల పరిశీలన, అభ్యంతరాల పరిష్కారం తదితర అంశాలను సమీక్షించి ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవోలు వెంకటరెడ్డి, శ్యామ్‌సుందర్, ఏఈఆర్‌వోలు, ఇతర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



