హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3: ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్(పీడీ యాక్ట్) కింద కేసుల విచారణకు సంబంధించిన అడ్వైజరీ బోర్డు కార్యాలయాన్ని బేగంపేటలోని గ్రీన్‌ల్యాండ్స్ గెస్ట్‌హౌస్ నుంచి రాజ్‌భవన్ రోడ్‌లోని దిల్‌కుశా గెస్ట్‌హౌస్‌కు మార్చినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. పీడీ యాక్ట్‌కు సంబంధించిన అడ్వైజరీ బోర్డు కార్యాలయం ఇకపై దిల్‌కుశా గెస్ట్‌హౌస్‌లో కొనసాగుతుందని పేర్కొంది. పీడీ యాక్టుకు సంబంధించిన సమావేశాలు, కేసుల విచారణలు, ఇతర సంబంధిత కార్యక్రమాలు ఇక నుంచి దిల్‌కుశా గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన పీడీ యాక్ట్ విచారణ అడ్వైజరీ బోర్డు కార్యాలయంలోనే జరుగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలు, సంబంధిత అధికారులు, కేసులకు సంబంధించిన వ్యక్తులు ఇకపై పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు కార్యాలయ వ్యవహారాల కోసం దిల్‌కుశా గెస్ట్‌హౌస్‌ను సంప్రదించాలని సూచించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




