హరీష్.. తప్పుడు ప్రచారం మానుకోండి

– కట్టు కథలతో బట్ట కాల్చి మీద వేయడమే మీ పనా?
– తొలుత కాళేశ్వరం ముడుపుల లెక్క చెప్పు
– ఏపీకి అమ్ముడుపోయి విమర్శలా
– నెలాఖరులో సమ్మక్క సాగర్‌కు ఎన్‌వోసీ
– నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 5 : ఏపీ ప్రభుత్వం పన్నెండేళ్లుగా ప్రతీ బోర్డు సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నదని, ఇది కొత్త విషయం కాదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏపీ ప్రాజెక్టులకు పరోక్షంగా మద్దతు ఇచ్చిన బీఆరఎస్ పార్టీ నేతలు అధికారం కోల్పోగానే కడుపు మంటతో బట్ట కాల్చి మీద వేస్తున్నారని విరుచుకుపడ్డారు. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు. తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న బీఆరఎస్ ఏ రోజూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేదని, ఆ పార్టీ ప్రభుత్వ హయాంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు జరిగింది వాస్తవం కాదా, పోలవరం- బనకచర్ల ప్రాజెక్టు పనులు ప్రారంuమైంది బీఆరఎస్ హయాంలో కాదా అని ప్రశ్నించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం మీరు అధికారంలో ఉండగా పూర్తి కాలేదా అని నిలదీశారు. తెలంగాణ సొమ్మును లూటీ చేసి అధికారం కోల్పోగానే మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 18న జరిగే 18 జీఆరఎంబీ సమావేశం అజెండాలో చేర్చిన అంశాలు కొత్తవేమీ కావని, ఇవే అంశాలను గత మీటింగులలో, కరెస్పాండోన్స్‌లో కూడా ఏపీ ప్రభుత్వం ప్రస్తావిస్తూ వస్తున్నదన్నారు. ఇవే అంశాలు సీతారామ ఎత్తిపోతల పథకం క్లియరెన్స్ విషయంలోనూ ప్రస్తావించిందన్నారు. దీనిపై తమ ప్రభుత్వం దీటుగా స్పందించి అవన్నీ నిరాధారమైనవని జీఆరఎంబీకి, సీడబ్ల్యూసీ దృష్టికి తీసుకువెళ్లి ఎసఎసఎంపీ-ఎసఆరఎలఐపీ టీఏసీ క్లియరెన్స్(158 మీటింగ్ తేదీ 24.04.2025) విజయవంతంగా అనుమతులు సాధించిందని మంత్రి ఉత్తమ్ గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీ ప్రభుత్వం నిరంతరం జీఆరఎంబీ, సీడబ్ల్యూసీ, జలశక్తి మంత్రిత్వ శాఖకు కాళేశ్వరం, సీతారామ, సమ్మక్క, చిన్న కాళేశ్వరం, చనాకా-కొరటా, మోదికుంట వాగు, గూడెం లిఫ్ట్ తదితర ఏడు ప్రాజెక్టుల అనుమతులు ఇవ్వరాదని కోరుతూ వచ్చిందని తెలిపారు. ఎంవోజేఎస్ ద్వారా టీఏసీ క్లియరెన్స్ పొందిన తరువాత కూడా సమీక్షించాలని ఏపీ ప్రతి మీటింగ్‌లో ప్రస్తావిస్తున్నదన్నారు. ఈ సందర్భంలో చెప్పదగ్గ విషయం ఏమిటంటే ఏపీ లేవనెత్తిన ఆ అంశాలను ఈ ప్రభుత్వం దీటుగా ప్రతిఘటించి మన రాష్ట్ర నీటి హక్కులను కాపాడడంలో సఫలీకృతమైనదని స్పష్టం చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభత్వం ఎలాంటి ఉదాసీనత ప్రదర్శించడంలేదన్నారు. గత బీఆరఎస్ ప్రభుత్వమే 3వ జీఆరఎంబీ మీటింగ్‌లో రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి సంబంధించి ఆయా రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదరాలి లేదా ఒక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి అని తన వైఖరిని స్పష్టం చేసిందని తెలిపారు. ఈ రెండు రాష్ట్రాలకు నీటి సరఫరా నియంత్రణను జీఆరఎంబీ ప్రారంభించే ముందే ఈ షరతులలో ఏదో ఒకటి నెరవేరాలని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. ఇదే విషయాన్నీ పునరుద్ఘాటిస్తూ గత బీఆరఎస్ ప్రభుత్వం సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో (6.10.2020) ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం ఏపీతో పోటీ పడి కోరిందని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం సమయస్ఫూర్తితో అడుగులు వేసి కేంద్ర ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా ట్రిబ్యునల్ ఇప్పటివరకు ఏర్పడకుండా అడ్డుకున్నదన్నారు. ఇదీ ఈ ప్రభుత్వం నిబద్ధత అని అన్నారు.
అంతర్రాష్ట్ర వ్యవహారాల(ఐఎసఎం) డైరెక్టరేట్ క్లియరెన్స్, ఏపీ క్లియరెన్స్ పొందడంలో గత ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ముంపు సమస్యకు సంబంధించి కూడా గత ప్రభుత్వం ఆ రాష్ట్రంతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని చాలాసార్లు సంప్రదించి/సందర్శించి, ఐఎసఎం డైరెక్టరేట్ క్లియరెన్స్ పొందేందుకు ముంపు సమస్యకు సంబంధించి ఛత్తీస్‌గఢ్ నుండి నిరభ్యంతర పత్రం పొందేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోందని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఎన్‌వోసీ కోసం మూడుసార్లు ఛత్తీస్‌గఢ్ సీఎంను కలిసి ఎన్‌వోసీ కోసం విజ్ఞప్తి చేశామన్నారు. నెలాఖరులో ఇస్తామని సీఎం చెప్పారన్నారు. మీరు అధికారంలో ఉండగా ఒక్కసారి అయినా ఛత్తీస్‌గఢ్ సీఎం ను కలిశారా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యంతరాలను సమర్థవంతంగా ప్రతిఘటించి రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్టమొదటి బహుళార్థసాధక సీతమ్మ సాగర్ – సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు టీఏసీ అనుమతులు 24.4.2025న సాధించిందని చెప్పారు. తొమ్మిదిన్నరేళ్లలో మీరు చేయలేని పని చేశామని, 67 టీఎంసీల నీటి కేటాయింపులు సాధించామని చెప్పారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించినట్టు ట్రిబ్యునల్ ఏర్పరిచే విషయంలో కూడా ఈ ప్రభుత్వం సమయస్ఫూర్తితో అడుగులు వేసి కేంద్ర ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా ట్రిబ్యునల్ ఇప్పటివరకు ఏర్పడకుండా అడ్డుకుందన్నారు.
పీబీఎల్‌పీ ప్రతిపాదన గురించి తెలిసిన తర్వాత ఈ ప్రభుత్వం వెనువెంటనే స్పందించిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ చెప్పారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి రెండుసార్లు, నీటిపారుదల శాఖ మంత్రిగా తాను ఏడుసార్లు, పదిసార్లు ప్రధాన కార్యదర్శి, ఈఎన్‌సీ(జి)19 సార్లు వివిధస్థాయిల అధికారుల ద్వారా ఎంవోఎఫ్, ఎంవోజేఎస్, ఎంవోఈఎఫ్ అండ్ సీసీ, సీడబ్ల్యూసీ, జీఆరఎంబీ, కేఆరఎంబీ, టీ పీపీఏలతో సుదీర్ఘమైన ఉత్తరప్రత్యుత్తరాలు జరిపామన్నారు. న్యాయపరమైన చర్యలో భాగంగా ప్రభుత్వం సుప్రీమ్ కోర్టు ముందు ఒరిజినల్ సూట్, ఐఏ వ్యాజ్యాలు వేసిందన్నారు. ప్రతివాదులందరూ నాలుగు వారాల్లోగా తమ సమాధానాలను దాఖలు చేయాలని న్యాయస్థానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందన్నారు. 2018-2022 మధ్య కాలంలో రాయలసీమ ప్రాంతానికి 200 టీఎంసీల వరద నీటిని తరలించే పనులను ఏపీ ప్రభుత్వం చేపట్టినప్పటికీ అప్పటి బీఆరఎస్ ప్రభుత్వం మాత్రం ప్రేక్షకపాత్రకే పరిమితం కాలేదా అని నిలదీశారు. ఆర్డీఎస్‌లో వాటా మేరకు నీళ్ల కోసం ఏ రోజూ బీఆరఎస్ ప్రయత్నం చేయలేదన్నారు. ఆర్డీఎస్ ఆధునికీకరణ విషయంలో ఏపీ, కర్ణాటక సీఎంలను ఒప్పించాం.. మీరు ఏ రోజైనా కర్ణాటక సీఎంను కలిసి ఒప్పించారా అని నిలదీశారు. కేడబ్ల్యూడీటీలో కృష్ణా జలాల వాటా కోసం స్వయంగా విచారణకు హాజరై న్యాయనిపుణులతో సూచన చేశామన్నారు. గత ప్రభుత్వం కంటే సమర్థవంతంగా వాదనలు వినిపిస్తున్నామని, రాష్ట్ర ప్రజల నీటి హక్కులను పరిరక్షించేందుకు ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు. బేసిన్లు లేవు.. భేషజాలు లేవు అనే సిద్ధాంతం కలిగిన బీఆరఎస్ ద్వంద్వ విధానాలతో తాము నేర్చుకోవాల్సింది ఏమీ లేదన్నారు. తొలుత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏపీ కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు అందాయనే కవిత ఆరోపణలకు జవాబు చెప్పాలన్నారు. అ ముడుపుల్లో నీ వాటా ఎంత. తెలంగాణలో అధికారంలోకి రావడం లేదని ఏపీతో కుమ్మక్కై నాగార్జున సాగర్ ప్రాజెక్టును వివాదం చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. రూ.లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును నిండా ముంచి సిగ్గు లేకుండా రాజకీయాలు చేస్తావా అని మంత్రి హరీష్‌రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *