– జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు..
– తీర ప్రాంత ప్రజలకు అధికారుల హెచ్చరికలు
– సరిహద్దు కృష్ణ బ్రిడ్జి వద్ద ఆహ్లాదకర దృశ్యాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5 : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా కృష్ణానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కర్ణాటక పరివా హక ప్రాంతాల నుంచి భారీగా ప్రవాహం రావడంతో కృష్ణా, భీమా నదుల్లో వరద ఉధృతి గణనీయంగా పెరిగింది. కర్ణాట కలోని రాయచూర్ జిల్లా కృష్ణానదిపై నిర్మించిన గుర్జాపూర్ బ్యారేజీ తో పాటు యాదగిరి జిల్లా భీమా నదిపై ఉన్న గుగ్గల్ బ్యారేజీలకు వరద నీరు పోటె తింది. దీంతో అధికారులు అప్రమత్తమై ఈ బ్యారే జీల 40 గేట్లను ఎత్తి దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు.
ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద జలా లు తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టుకు చేరుతుండటం తో నది పరివాహక ప్రాంతం జలకళను సంతరించుకుంది. నది పూర్తిగా నీటితో నిండిపోవడంతో తెలంగాణ-కర్ణాటక సరి హద్దులోని కృష్ణ బ్రిడ్జి కింద ప్రవహిస్తున్న వరద ప్రవాహం ఆహ్లాదకర దృశ్యాన్ని తలపిస్తోంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు స్థానికులతో పాటు ప్రయాణికులు కూడా బ్రిడ్జి వద్దకు చేరుకుని ఫొటోలు, వీడియో లు తీసుకుంటున్నారు. కృష్ణా నదిలో ప్రవాహం రోజురోజుకు వర ద ప్రవాహం పెరుగుతుందడడంతో జూరా ల ప్రాజెక్టు అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నది పరివా హక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండా లని సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా, వర ద ఉధృతి కారణంగా నదిలో స్నానాలు చేయకుండా, చేపల వేటకు వెళ్లకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





