ఒకే క్యాంపస్ నుంచి గ్రేహౌండ్స్, ఆక్టోపస్

– టెక్నాలజీ ఆధునికీకరణతో సీసీటీఎన్ఎఎస్ 3.0, హాక్ ఐ 3.0 ప్రాజెక్టులు
– డీజీపీ ఆనంద్ అధ్యక్షతన స్టాఫ్ ఆఫీసర్ల సమావేశం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21: పోలీసు శాఖను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా చేపట్టాల్సిన పలు కీలక అంశాలపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సి.వి.ఆనంద్ అధ్యక్షతన స్టాఫ్ ఆఫీసర్ల సమావేశం మంగ‌ళ‌వారం జ‌రిగింది. సమావేశంలో పోలీసు శాఖకు సంబంధించిన పలు విధానపరమైన, పరిపాలనా, సాంకేతిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా ఎస్ ఆర్సీ నివేదిక అమలు, మావోయిస్టు ముప్పు పేరుతో అవసరానికి మించి కల్పించిన భద్రతను ఉపసంహరించడం ద్వారా దాదాపు 400మంది పోలీసు సిబ్బందిని, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను సమర్థవంతంగా వినియోగంలోకి తీసుకురావడం, శాఖలోని సిబ్బంది. వాహనాల ఆడిట్, అమలు విధానంపై సమీక్ష నిర్వహించారు. అలాగే ప్రస్తుత పరిస్థి తులకు అనుగుణంగా గ్రేహౌండ్స్, ఆక్టోపస్ యూనిట్లను ఒకే క్యాంపస్ నుంచి నిర్వహించే అంశం, పోలీసు మాన్యువల్ తుది రూపకల్పన, ఐపీఎస్ అధికారుల యూనిఫాం లో క్రాస్ బెల్ట్లు, లాఠీలు వంటి సంప్రదాయ అంశాల ప్రస్తుత అవసరంపై చర్చించారు. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బందికి సంబంధించిన వివిధ సమస్యలు, వాటి పరిష్కారంలో ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయం, విజిలెన్స్, ఆహార కల్తీ నిరోధం, డ్రగ్ కంట్రోల్ వంటి రంగాల్లో కొత్త ఎన్ఫో ర్స్మెంట్ విభాగాల ఏర్పాటు, ట్రాఫిక్ రోడ్డు భద్రత బ్యూరో ఏర్పాటు వంటి అంశాలను కూడా సమీక్షించారు. ఇదే సందర్భంగా ప్రస్తుత సాంకేతిక అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీ కంప్యూటర్ సర్వీసెస్ విభాగా న్ని ఆధునీకరించడం, అలాగే సీసీటీఎన్ఎస్ 3.0, టీజీ-కాప్ 3.0, హాక 3.0 ప్రాజెక్టుల పురోగతిపై కూడా డీజీపీ సమీక్షించారు. సమావేశంలో అధికారులు చేసిన సూచ నలు, అభిప్రాయాలను పరిశీలించి, తెలంగాణ పోలీసు శాఖ భవిష్యత్ విధానాల రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటామని డీజీపీ ఆనంద్ తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *