మలక్‌పేట్, ప్రజాతంత్ర, హైదరాబాద్, జూలై 21: బ్లడ్ క్యాన్సర్లు, క్లిష్టమైన రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులు, పెద్దలకు అత్యాధునిక చికిత్సలు అందించేందుకు హైదరాబాద్ మలక్‌పేట్‌లోని రెనోవా బిబి క్యాన్సర్ హాస్పిటల్స్‌లో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ (బీఎమ్‌టీ), సెల్యులార్ థెరపీ సేవలు రోగులకు అందుబాటులో ఉన్నాయి. దీంతో హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాల రోగులు అంతర్జాతీయ ప్రమాణాల చికిత్సను అందుబాటు ధరల్లో, తమకు చేరువలోనే పొందే అవకాశం లభిస్తోంది. ఈ సందర్భంగా సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అండ్ హీమాటో-ఆంకాలజిస్ట్, క్లినికల్ లీడ్ – బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ అండ్ సెల్యులార్ థెరపీ, డాక్టర్ ఎం.డి. నదీమ్ అహ్మద్ మాట్లాడుతూ… బ్లడ్ క్యాన్సర్లను ప్రారంభ దశలోనే గుర్తించి, సకాలంలో అత్యాధునిక చికిత్స అందించడం ద్వారా మెరుగైన చికిత్స ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు. ఇక్కడ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా (ఏఎల్ ఎల్), అక్యూట్ మైలాయిడ్ ల్యుకేమియా (ఏఎంఎల్) వంటి బ్లడ్ క్యాన్సర్లకు ప్రత్యేక వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కేంద్రంలో ఆటోలాగస్, అల్లోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌లతో పాటు మ్యాచ్‌డ్ సిబ్లింగ్ డోనర్, మ్యాచ్‌డ్ అన్రిలేటెడ్ డోనర్ (ఎంయూడీ), హాప్లోఐడెంటికల్ (సగం మ్యాచ్ అయ్యే) ట్రాన్స్‌ప్లాంట్ సేవలు, అలాగే కార్-టి సెల్ థెరపీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రోగి శరీరంలోని రోగనిరోధక కణాలైన టీ-సెల్స్‌ను జన్యుపరంగా మార్పులు చేసి, క్యాన్సర్ కణాలను గుర్తించి వాటిని లక్ష్యంగా చేసుకుని నాశనం చేసే కార్-టి సెల్ థెరపీ ద్వారా ల్యుకేమియా, లింఫోమా వంటి బ్లడ్ క్యాన్సర్ల చికిత్సలో ఆశాజనక ఫలితాలు లభిస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాల వైద్య సేవలను అందుబాటు ధరల్లో హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాల రోగులకు అందించడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అండ్ హీమాటో-ఆంకాలజిస్ట్, హెడ్ – బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ అండ్ సెల్యులార్ థెరపీ, డాక్టర్ విషాల్ టోకా మాట్లాడుతూ… బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్, సెల్యులార్ థెరపీ రంగాల్లో వచ్చిన ఆధునిక పురోగతితో రక్త క్యాన్సర్లు, క్లిష్టమైన రక్త సంబంధిత వ్యాధుల చికిత్సలో మెరుగైన ఫలితాలు సాధ్యమవుతున్నాయని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాల చికిత్సా విధానాలు, నిపుణులైన వైద్య బృందంతో ప్రతి రోగి అవసరాలకు అనుగుణంగా సమగ్ర వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ అండ్ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సయ్యద్ అక్బర్ కోత్వాల్ మాట్లాడుతూ…అధునాతన క్యాన్సర్ వైద్యాన్ని సామాన్యులకు సైతం అందుబాటులోకి తేవాలనే మా సంకల్పానికి ఈ బీఎమ్‌టీ కేంద్రం నిదర్శనం. సమగ్ర బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ సేవలతో పాటు కార్-టి సెల్ థెరపీ వంటి అత్యాధునిక చికిత్సలను రోగులకు చేరువ చేసి, నాణ్యతలో రాజీ లేకుండా మానవతా దృక్పథంతో కూడిన క్యాన్సర్ వైద్య సేవలను అందుబాటు ధరల్లో రోగులకు అందిస్తున్నామని తెలిపారు. హాస్పిటల్ సీఓఓ ప్రొఫెసర్ మహ్మద్ మసూద్ అహ్మద్ మాట్లాడుతూ… ఆసుపత్రి ప్రస్థానాన్ని వివరిస్తూ, దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి అత్యాధునిక క్యాన్సర్ చికిత్సా కేంద్రాల అవసరం మరింత పెరిగిందని అన్నారు. ప్రతి రోగికి సకాలంలో నాణ్యమైన క్యాన్సర్ చికిత్స అందుబాటులో ఉండేలా చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. నిపుణులైన వైద్య బృందంతో ప్రపంచ స్థాయి క్యాన్సర్ వైద్య సేవలను మరింత మంది రోగులకు చేరువ చేయడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





