– పుస్తకాలను స్వీకరించిన గవర్నర్. ఆత్మీయ చర్చ
– రచనా వ్యాపకాన్ని కొనసాగించాలని సూచన
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: బీసీ కమిషన్ మాజీ చైర్మన్, రచయిత డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు రచనా కృషిని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అభినందించారు. ఈ వ్యాపకాన్ని కొనసాగించాలని సూచించారు. లోక్ భవన్ లో గవర్నర్ ను డాక్టర్ వకుళాభరణం తన సతీమణి సుధాశ్రీతో బుధవారం ప్రత్యేకంగా కలిశారు. విజయదశమి సందర్భంగా జమ్మి ఆకులు అందజేసి,పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. గవర్నర్ శాలువాతో సత్కరించి, జ్ఞాపికను సమర్పించారు. తాను రచించిన ‘సామాజిక న్యాయం- ఆర్ధిక సమానత్వం-అభివృద్ధి దిశగా జీఎస్టీ’, ‘శ్రీ నరేంద్ర మోదీ: భారత్ ను విశ్వ వేదికపై నిలిపిన మహానాయకుడు’, ‘అంత్యోదయం నుంచి వికసిత్ భారత్’, ‘మోడీ వాణి: సేవ సంకల్పం, వికసిత భారత్’ పుస్తకాలను అందజేశారు. గవర్నర్ ఈ పుస్తకాలను స్వీకరించి వాటిలోని అంశాలపై ఆసక్తిగా చర్చించారు. వకుళాభరణం దంపతులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి వ్యక్తిగత, కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. బీసీ కమిషన్ చైర్మన్ గా, సభ్యుడిగా వకుళాభరణం నిర్వర్తించిన బాధ్యతలు, చేపట్టిన కార్యక్రమాల గురించి అడిగి ఆయన పంచుకున్న అనుభవాలను శ్రద్ధగా విన్నారు. ఈ భేటీలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఎం.దానకిషోర్ కూడా పాల్గొన్నారు. గవర్నర్ ఆప్యాయత, అభినందనలు తన రచనా వ్యాసంగానికి మరింత ప్రోత్సాహాన్నిచ్చాయని వకుళాభరణం తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





