ప్రమాదకరస్థాయికి వాయు కాలుష్యం

– దిల్లీలో అమలులోకి గ్రాప్-1 ఆంక్షలు

దిల్లీ, అక్టోబర్ 21 : దిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరింది. కేవలం ఒక్క రోజులోనే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 179 (మధ్యస్థం) నుండి 244కి(గ్రాప్-1 పరిధిలోకి) పడిపోవడంతో కేంద్ర వాయు నాణ్యత నిర్వహణ కమిషన్(సీఏక్యూఎం) జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్) వ్యాప్తంగా గ్రాప్-1 ఆంక్షలను తక్షణమే అమలుల్లోకి తెచ్చింది. శీతాకాలం ప్రారంభం కానుండటం, పండుగల సీజన్ ప్రభావంతో కాలుష్య స్థాయిలు పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ఈ ముందస్తు చర్యలు చేపట్టారు. బొగ్గు, కట్టెలతో నడిచే తందూరీలపై పూర్తిగా నిషేధం విధించారు. 500 చదరపు మీటర్ల కంటే పెద్దగా ఉండే నిర్మాణ స్థలాలలో ఖచ్చితమైన డస్ట్ కంట్రోల్ నిబంధనలు పాటించాలి. సరైన పీయÖసీ సర్టిఫికెట్ లేని వాహనాలపై కఠిన చర్యలు ఉంటాయి. పదేళ్లు దాటిన డీజిల్, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాల తిరగడంపై నిఘా పెంచారు.

కాలుష్య నివారణ చర్యలు

రోడ్లపై యాంత్రిక పద్ధతుల్లో ఊడ్చడం, యాంటీ-స్మాగ్ గన్స్ ఉపయోగించడం, నీటిని చల్లడం వంటి చర్యలను ముమ్మరం చేశారు.అత్యవసర సేవలకు మాత్రమే డీజిల్ జనరేటర్ల వాడకాన్ని పరిమితం చేశారు. దిల్లీ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రయాణాలకు వీలైనంత వరకు ప్రజా రవాణాను ఉపయోగించాలని, కాలుష్య నియంత్రణకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

సామాన్యుల దైనందిన జీవితంపై ప్రభావం 

గ్రాప్-1 ఆంక్షల వల్ల సాధారణ ప్రజల దైనందిన జీవితం, జేబులపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ప్రయాణాలు, ఖర్చులు, ఆరోగ్యంపరంగా ప్రజలు మార్పులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కారు, బైక్ వంటి వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించేందుకు మెట్రో పార్కింగ్‌లు మినహా దిల్లీ వ్యాప్తంగా పార్కింగ్ చార్జీలను రెట్టింపు చేశారు. దీనివల్ల సొంత వాహనాల్లో వెళ్లేవారికి ఖర్చులు పెరుగుతాయి. వాహనాలకు చెల్లుబాటు అయ్యే కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రం (పీయÖసీ) లేకపోతే పెట్రోల్ బంకుల్లో ఇంధనం ఇవ్వరు. అంతేకాక ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు విధిస్తారు, వాహనాన్ని సీజ్ చేసే అవకాశం కూడా ఉంది. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు జంక్షన్ల వద్ద అదనపు పోలీసులను మోహరిస్తారు. వాహనదారులు రెడ్ లైట్ పడినప్పుడు ఖచ్చితంగా ఇంజిన్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *