–– భూసేకరణ, పునరావాస ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి
– అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణ, పునరావాస సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. భూసేకరణ, పునరావాస ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆయన అధ్యక్షతన భూసేకరణ, పునరావాసంపై శనివారం ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది. సిద్దిపేట, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల భూసేకరణ వివరాలు, పెండింగ్ అంశాలపై పరిశీలించారు. గౌరవెల్లి నిర్వాసితుల పునరావాస సమస్యలపై సంబంధిత అధికారులు, ఉన్నతాధికారులతో సమగ్ర చర్చ జరిపారు. భూసేకరణకు అవసరమైన నిధులు ఇప్పటికే సంబంధిత జిల్లాల కలెక్టర్లకు చేరాయని, భూసేకరణ, పునరావాస ప్రక్రియ వేగవంతానికి సత్వరం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అటవీ నోటిఫికేషన్ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి ఉత్తమ్ సూచించారు. ఎడమ, కుడి కాల్వల అంచనాలు, పంపిణీ ప్రతిపాదనలపై కూడా సమీక్షించారు. కాల్వల టెండర్ ప్రతిపాదనల స్థితిపై పరిశీలించారు. ప్రాజెక్టులో నీరు నిల్వ, విడుదల నివేదికలపై సమీక్షించారు. పర్యావరణ అనుమతులు, ఎన్‌జీటీ కేసుకు సంబంధించిన అంశాలపై, ఎంఎంఆర్ ప్యాకేజీ-3 ప్రతిపాదనలపై సమీక్షించారు. ఈ ప్రత్యేక సమీక్షలో రవాణా, బీసీ¾ సంక్షేమ శాU మంత్రి పొన్నం ప్రభాకర్, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్, భూసేకరణ-పునరావాస కమిషనర్ శివకుమార్ నాయుడు, ఈఎన్‌సీ జనరల్ రమేష్‌బాబు, ఈఎన్‌సి ఓ అండ్ ఎం మధుసూదన్ రావు, జాయింట్ సెక్రటరీ కె.శ్రీనివాస్, సంబంధిత జిల్లాల అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





