– దిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
దిల్లీ, సెప్టెంబర్ 4 : దేశ రాజధాని ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి అక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో నీరు సగటున చేరింది. మోకాలి లోతులో వరద నీరు నిలిచి పోయింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నే షనల్ ఎయిర్పోర్టును కూడా వరద నీరు ముంచెత్తింది. దీంతో విమానాల రాకపోలకు ఇబ్బంది ఎదురవుతోంది. విమానాలు 17 నిమిషాలు ఆలస్యంగా నడు స్తున్నాయి. సాయంత్రం రావాల్సిన పలు విమానాలను అధికారులు దారి మళ్లించారు. ఎయిర్పోర్టులో నీరు చేరిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఢిల్లీతో పాటు హరియాణా, చండీగఢ్ ప్రాంతాల్లో, యూపీలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ పేర్కొంది. ఈశాన్య మధ్యప్రదేశ్లో అల్పపీడన ద్రోణి కారణంగా సెంట్రల్ ఇండియాలో వర్షాలు కురుస్తున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





