శ్రీశైలానికి కొనసాగుతున్న వరద

– 2.32 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం
– 876.20 అడుగులకు చేరిన నీటిమట్టం
– పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో జలాశయం
– విద్యుదుత్పత్తితో సాగర్కు 66,460 క్యూసెక్కుల నీరు విడుదల
– తుంగభద్రకు తగ్గిన వరద.. 72.26 టీఎంసీల నిల్వ

శ్రీశైలం, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజె క్టు వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 2,32,308 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 876. 20 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 169.46 టీఎంసీలకు చేరింది. ఈ క్రమం లో అధికారులు కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి చేసి 66,460 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,133 క్యూసెక్కుల నీటి ని విడుదల చేయగా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు 8 వేల క్యూసెక్కులు, హంద్రీనీవాకు 875 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాగా, కృష్ణా నదిలో వరద ప్రవాహం పరవళ్లు తొక్కు తున్నా సాగర్కు విడుదల కావడం లేదు. ఒకవైపు కృష్ణా, భీమా నదులు పొంగిపొర్లుతూ శ్రీశైలం వైపు పరుగులు తీస్తుంటే రాష్ట్ర సర్కార్ పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోయకుండా దోబూచులాడుతున్నదన్న విమర్శలు ఉన్నాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి నాలుగు మోటర్లు సిద్ధంగా ఉన్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో మరో నాలుగు మోటర్లతో కూడా నీటిని ఎత్తిపోయొచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రెండు ప్రా జెక్టులకు నీటిని వదలకుండా కృష్ణా జలాలను వృథాగా దిగువకు వదిలిపెడుతున్నదని పాలమూరు నేతలు మండిపడు తున్నారు. ఇదిలా వుంటే తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం ప ట్టిందని టీబీ డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. శనివారం ఉద యం 42,114 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగింది. ప్రస్తుతం డ్యాంలో 1,623.68 అడుగులకు గాను 72.26టీఎంసీల నీటి నిల్వ ఉంద న్నారు. తాగునీటి అవసరాలు కోసం వివిధ కాల్వలకు 1,514 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగునీటి విడుదలపై ఈనెల 11 తేదీన కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *