నగదు లెక్కిస్తామని రూ.15వేలతో ఉడాయింపు

– పోలీసులకు మోసపోయిన మహిళ ఫిర్యాదు 

కామారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 29: కామారెడ్డి జిల్లాలోని ఎస్‌బీఐలో దొంగల చేతిలో ఓ మహిళ మోసపోయింది. డబ్బులు లెక్కపెడతామని నమ్మించిన దుండగులు మహిళ వద్ద ఉన్న నోట్ల కట్టలో నుంచి రూ.15 వేలను చాకచక్యంగా మాయం చేశారు. పాల్వంచ మండలం వాడి గ్రామానికి చెందిన పూజ అనే మహిళ కామారెడ్డిలోని ఎస్‌బీఐ శాఖకు వెళ్లింది. బ్యాంకులో నగదు లెక్కపెడుతున్న సమయంలో కొందరు వ్యక్తులు ఆమెను గమనించారు. ఆమె వద్దకు వెళ్లి డబ్బులు సరిగా లెక్కపెడతామని, నోట్లను పరిశీలిస్తామని నమ్మబలికారు. దాంతో ఆమె తన వద్ద ఉన్న నగదును వారికి ఇచ్చింది. ఈ క్రమంలో దుండగులు అనుమానం కలగకుండా వ్యవహరించి నోట్ల కట్టలో నుంచి రూ.15 వేలు తీసుకున్నారు. అనంతరం వారు అక్కడినుంచి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత నగదు తక్కువగా ఉన్నట్లు గుర్తించిన బాధితురాలు మోసపోయానని గ్రహించింది. ఆమె ఫిర్యాదు మేరకు బ్యాంకులో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తూ నిందితుల వివరాలు సేకరిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని బాధితురాలికి ధైర్యం చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *