ప్రజాస్వామ్యానికి ఓటు హక్కే మూలస్తంభం

– ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకెళ్తాం
– పారదర్శకంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– దిల్లీలో ముగిసిన టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీ

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూలై 29 : భారత ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి పౌరుడి ఓటు హక్కే మూలస్తంభమని, అర్హుడైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా పకడ్బందీ కార్యాచరణను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. దిల్లీలోని ఏఐసీసీ జాతీయ కార్యాలయం ఇందిరా భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ భేటీ ముగిసిన అనంతరం డిప్యూటీ సీఎం భట్టి మీడియాతో మాట్లాడారు. సమావేశంలో ప్రధానంగా మూడు అంశాలపై విస్తృత చర్చ జరిగిందని, పార్టీ-ప్రభుత్వ సమన్వయంపై కీలక నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రత్యేక ఓటరు నమోదు (ఎసఐఆర్) ప్రక్రియపై రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. పార్టీ నియమించిన బూత్ లెవల్ ఏజెంట్లు(బీఎలఏలు) అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నారని, వారి పనితీరును ఏఐసీసీ సైతం సమీక్షించి అభినందించిందని చెప్పారు. మిగిలిన ఓటరు నమోదు ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేయాలని ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ సూచించారన్నారు. మరోవైపు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ కేడర్, సంస్థాగత వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికీ చేర్చేందుకు సమావేశంలో ఒక ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లు ఆయన వివరించారు. రాబోయే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి సమన్వయ కమిటీలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. ముందుగా గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును వేగవంతం చేయడంతోపాటు ఎమ్మెల్సీ బరిలో నిలిచే ఆశావహుల ఎంపిక పారదర్శకంగా జరిగేలా చూడాలని నిర్ణయించామన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఆయా జిల్లాల ఇన్‌చార్జి మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. మంత్రులు తమ జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు(డీసీసీ), ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులతో విస్తృతంగా చర్చించి ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను అధిష్ఠానానికి సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మొత్తంగా ఓటరు నమోదు, ప్రభుత్వ పథకాల ప్రచారం, ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహాలపై భేటీలో స్పష్టమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకుని వాటి అమలుకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు భట్టి విక్రమార్క వివరించారు.

‘సర్’పై సమీక్షించామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. 36 వేల మంది బీఎలఏలను నియమిం చినట్లు చెప్పారు. 50`60 శాతం ఈ పక్రియ పూర్తయిందని, రెండుమÖడు రోజుల్లో 100 శాతం పూర్తవుతుందని వివరించారు. అర్హత గల ఓటర్ల ఓటు హక్కు కాపాడటం తమ లక్ష్యమని చెప్పారు. ఈసారి ‘సర’ పక్రియ దురుద్దేశంతో జరుగుతున్నదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క, ఏఐసీసీ సెక్రటరీ వంశీచందర్ రెడ్డి, పలువురు ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *