వైటీడీఏ ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా సీఎస్

– ప్రమాణ స్వీకారం చేయించిన ఆలయ ఈవో

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జూలై 29: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని బుధవారం దర్శించుకున్నారు. దేవస్థానం(వైటీడీఏ) ఎక్స్-ఆఫీషియో సభ్యుడిగా ఆలయ ప్రధానాలయంలోని బంగారు వాకిలి వద్ద ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి(ఈఓ) భవానీశంకర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలను అప్పగించారు. అంతకుముందు వేద పండితులు సంజయ్ జాజు దంపతులకు స్వాగతం పలికి వేదాశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *