వనమహోత్పవంలో ప్రతి ఇంటికీ ఐదు మొక్కలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 25 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవంలో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ) ప్రతీ ఇంటికి ఐదు మొక్కలు (3 పండ్ల మొక్కలు, 2 ఔషధ/అలంకరణ మొక్కలు) ఉచితంగా ఇవ్వనున్నది. ఈ సంవత్సరం లక్ష కుటుంబాలకు వీటిని పంపిణి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఎన్జీవోస్/రోటరీ/లయన్స్ క్లబ్స్/స్వచ్చంద సంస్థలు/కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఈ కార్యక్రమం చేపట్టవచ్చునని తెలిపింది. ఆసక్తి కలవారు హెచ్‌ఎండీఏ హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ డి.చక్రపాణి, స్వర్ణ జయంతి కాంప్లెక్స్, అమీర్‌పేట్, హైదరాబాద్, మొబైల్ 8374449345, 7702776622లో సంప్రదించవచ్చు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *