“తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రం చేయటంవల్ల కలుగుతుందనుకున్న లాభాలను దానికి ప్రత్యామ్నాయంగా వచ్చిన తెలంగాణా ప్రాంతీయ సంఘం కల్గించలేదు, అలాగే తెలంగాణాప్రాంత ప్రణాళికాభివృద్ధి మండలి, తెలంగాణా ప్రాంతీయ సంఘం వంటిది కాదు.సమైక్య రాష్ట్రంలో తెలంగాణా వారికి రాజకీయ వెనుకబాటుతనపు లఘుభావం ఏదైనా వుండివుంటే రాష్ట్ర రాజకీయాధికారం చేపట్టిన తరువాత నిర్మూలమైందను కోవచ్చు..”
69, జనధర్మో విజయతే
ప్రాంతీయాభివృద్ధి మండలులు మూడు మన రాష్ట్రంలో ఉన్నాయి. మూటికి ముగ్గురు అధ్యక్షులున్నారు. ప్రాంతీయాభివృద్ధి మండలి అధ్యక్షుని హోదా మంత్రి హోదాకు సమానం. తెలంగాణా జిల్లాలను ఆంధ్ర రాష్ట్రంలో కలిపివేసినాడు తెలంగాణా ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీలు అమలును పర్యవేక్షించడానికి అన్నట్లు తెలంగాణా ప్రాంత కమిటీని ఏర్పాటు చేశారు. దానికి ఒక అధ్యక్షుడు, తెలంగాణా ప్రాంతపు శాసన సభ్యులు అందరు సభ్యులు, అప్పుడు ఆంధ్రకుగాని, రాయలసీమకుగాని ప్రాంతీయ మండలులు లేవు. తెలంగాణా ప్రాంతీయ మండలి మొదటి అధ్యక్షుడు శ్రీ అచ్యుతరెడ్డి రెండో అధ్యక్షుడు శ్రీ హయగ్రీవాచారి. మూడో అధ్యక్షుడు శ్రీ జె. చొక్కారావుగార్లు, వీరి హయాంలో వెనుకబడిన ప్రాంతమైన తెలంగాణాకు ఇచ్చిన హామీల ప్రకారం జరిగిన, అభివృద్ధి సమీక్ష జరిగేది వీరిహయాంలో వీరి సిపార్సులపై అనేక అభివృద్ధి పథకాల్లో కొన్ని అమలుకు వచ్చినై. కాకతీయ విశ్వవిద్యాలయంకు పూర్వ రూపం అయిన వరంగల్లు
పోస్టు గ్రాడ్యుయేట్ సెంటర్ అవతరించి తెలంగాణా ప్రాంతీయ కమిటి నిధులతో ఎదిగింది కూడా. సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం ఆరుసూత్రాల పథకం అమలుకు వచ్చింతర్వాత రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు ప్రాంతీయాభివృద్ధి మండలులు అవతరించాయి. కేంద్రం కేటాయించిన 90 కోట్ల రూపాయలను అయిదు సంవత్సరాలలో తెలంగాణాకు 45 కోట్లు, రాయలసీమకు 30 కోట్లు ఆంధ్రకు 15 కోట్లు వెచ్చించటం జరిగింది. తరువాత కేంద్రం అభివృద్ధి నిధులేవీ కేటాయించలేదు. కనుక నిధులు లేవు. రాష్ట్ర ప్రభుత్వం నిధుల కోసం కేంద్రానికి వినతి చేసింది. కాని నిధుల కేటాయింపు జరగలేదు. కనుక ప్రాంతీయ అభివృద్ధి మండలులు చేయటానికేమిలేదంటున్నారు. మంత్రుల స్థాయి హోదాలలో ఉన్న మూడు ప్రాంతీయ మండలం అధ్యక్షులను
శాధారహిత మంత్రులుగా భావించటం జరుగుతున్నదనుకోవచ్చు.
ముఖ్యమంత్రి శ్రీ అంజయ్య ఈ ప్రాంతీయ అభివృద్ధి బోర్డుల స్థానే కోస్తా ఆంధ్ర తుఫాను బాధిత ప్రాంతాల అభివృద్ధి బోర్డు, పారిశ్రామిక అభివృద్ధి బోర్డు, వెనుకబడిన ప్రాంతీయాభివృద్ధి బోర్డుగా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు ‘పెట్టారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అదనపు నిధులు కేటాయించామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే ఆ సమస్యలను జాతీయ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి సంఘం పరిశీలిస్తున్నదని కేంద్రం సమాధానం ఇచ్చిందని ఆర్థిక మంత్రి బయటపెట్టారు. అయితే ఆ నివేదిక వచ్చింతర్వాత దానిలో వెనుకబడిన ప్రాంతాలనూ, వాటికి కేటాయించవలసిన నిధులనూ పేర్కొనటం జరిగిందో లేదో చూచుకొని జరిగితే ఆ నిధుల కోసం, జరగకపోతే మళ్ళీ నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థించవలసి ఉంటుంది. ఈ పరిస్థితిలో ప్రస్తుత ప్రాంతీయాభివృద్ధి మండలులు 1981-82 రాష్ట్ర ప్రాణాళికకై నిర్ధారించిన 538 కోట్ల 29 లక్షల నిధులతో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికై నిర్దేశించిన నీటిపారుదల విద్యుచ్చక్తికి కేటాయించిన 295 కోట్ల 53 లక్షలు పోగా మిగిలిన డబ్బులో 10 శాతం గుర్తించిన వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించారు.
అంటే ఇందువల్ల 24 కోట్ల 27 లక్షలు లభిస్తాయి. ఈ మొత్తాన్ని 58.2 దామాషాలో తెలంగాణా రాయలసీమ ఆంధ్ర ప్రాంతాలకు కేటాయిస్తారన్న మాట! ఈ కేటాయింపు ప్రకారం లభ్యపడే ధనం, వెనుకబడిన ప్రాంతాలకు ఎలాగూ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తుంది. ప్రత్యేకంగా ఒక మండలి అవసరం లేదనేది పెద్దల అభిప్రాయంగా గోచరిస్తుంది. నిష్ప్రయోజనంగా ఉండే సంఘాల వల్ల కలిగే ప్రయోజనమేదీ లేని మాట నిజమే కాని ఏఏ కారణాల వల్ల ఆ సంస్థలు నెలకొల్పబడ్డాయో ఆ ప్రయోజనం సాధించబడక పూర్వమే అవి రద్దుపరచటంకన్న సజీవం చేయటమే అభిలషణీయం. ప్రాంతీయాభివృద్ది ప్రణాళికా మండలులు రద్దు అయితే ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలకు నష్టం ఏదీలేదు. ఆరు సూత్రాల పథకాలకు పూర్వం ఆ ప్రాంతాలకు అటువంటి మండలులేవీ అవసరం లేకపోయింది. ఎటొచ్చీ అవసరమైన తెలంగాణా ప్రాంతం లాభం కోలుపోతుంది, తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రం చేయటంవల్ల కలుగుతుందనుకున్న లాభాలను దానికి ప్రత్యామ్నాయంగా వచ్చిన తెలంగాణా ప్రాంతీయ సంఘం కల్గించలేదు, అలాగే తెలంగాణా ప్రాంత ప్రణాళికాభివృద్ధి మండలి, తెలంగాణా ప్రాంతీయ సంఘం వంటిది కాదు.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణా వారికి రాజకీయ వెనుకబాటుతనపు లఘుభావం ఏదైనా వుండివుంటే రాష్ట్ర రాజకీయాధికారం చేపట్టిన తరువాత నిర్మూలమైందను కోవచ్చు కాని వివిధ రంగాలలోగల వెనుక పాటును తొలగించడానికి దారిద్రరేఖకు అడుగున ఉన్న వారిని ఆ రేఖపైకి తెచ్చేందుకుచేసే ప్రయత్నం వంటిది కచ్చితంగా చేపట్టకతప్పదు. విద్యాలయాలలో ప్రవేశాలకు, ఉద్యోగాల అవకాశాలకు రిజర్వేషన్‌లు కల్పించక తప్పదు. ఇటువంటి ప్రయత్నాలు ఏర్పాట్లులేకుండా కలుగ గల ప్రయోజనం శూన్యం. అని 7.11.1981 జనధర్మ/వరంగల్ వాణి సంపాదకీయంలోని కేంద్ర భావాన్ని ఆధారంగా తీసుకుంటే, నేటి పరిస్థితిపై యం.యస్. ఆచార్యగారు రాసి ఉంటే, ఆయన విమర్శ కేవలం “తెలంగాణకు అన్యాయం జరుగుతోంది” అన్న స్థాయిలో ఉండేది కాదు. అభివృద్ధి అనే ముసుగులో సంస్థలను నిర్వీర్యం చేయడం, నిధుల పేరుతో బాధ్యతను తప్పించుకోవడం, ప్రాంతీయ అసమానతలను రాజకీయ లాభాల కోసం ఉపయోగించుకోవడం, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అదే పాత పరిపాలనా మనస్తత్వం కొనసాగడం అనే అంశాలపై ఆయన నేరుగా ప్రశ్నలు సంధించేవారు.
ఆచార్యగారు 1981 సంపాదకీయంలోని ఒక ముఖ్యమైన హెచ్చరిక, “ఏ కారణాల వల్ల ఆ సంస్థలు నెలకొల్పబడ్డాయో ఆ ప్రయోజనం సాధించబడక పూర్వమే అవి రద్దుపరచటంకన్న సజీవం చేయటమే అభిలషణీయం”, నేటికీ అత్యంత ప్రాసంగికంగా కనిపిస్తుంది. ఆ భావాన్ని నేటి తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలతో అనుసంధానించి, ఆచార్యగారి స్ఫూర్తిలో ఒక కొత్త సంపాదకీయంగా రాసి ఉండేవాడు. 1981 నవంబరు 7న యం. యస్. ఆచార్యగారు రాసిన ఘాటు సంపాదకీయం నేటి రాజకీయాలను చదివేందుకు ఒక పాత అద్దంలా కనిపిస్తున్నది. అప్పటికి తెలంగాణకు ప్రాంతీయ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన వ్యవస్థలు ఉండేవి. ఆ సంస్థలకు నిధులు తగ్గించి, వాటి చేతులు కట్టేసి, “ఇక చేయడానికి ఏముంది?” అని ప్రశ్నించడం జరుగుతున్నదని ఆచార్యగారు నిలదీశారు. అభివృద్ధి కోసం ఏర్పాటైన సంస్థకు నిధులు ఇవ్వకుండా, ఆ సంస్థ పనికిరాదని చెప్పడం ఎంతటి రాజకీయ తర్కమో ఆయన అప్పుడే ఎండగట్టారు.
యం యస్ ఆచార్య 102వ జయంతి ముగిసిన నాడు ప్రముఖ సాహితీవేత్త శ్రీ కోవెల సుప్రసన్నాచార్య (91) గారి ఇంటికి వెళ్ళి, జర్నలిస్టు రచయిత కోవెల సంతోష్ నిర్వహిస్తున్న స్వాధ్యాయ గ్రంధాలయంలో ప్రత్యేకంగా యం యస్ ఆచార్య పురస్కారాన్ని సమర్పించారు. మరునాడు 3.10.2026 న హైదరాబాద్ గోపనపల్లి, జర్నలిస్టుల సొసైటీ (3వ కాలనీ పార్క్ పక్కన) విగ్రహాన్ని పుష్పాంజలి సమర్పించారు.





