క‌లెక్ట‌ర్ ఉత్త‌ర్వుల‌తో సొంతింటికి వృద్ధ దంప‌తులు

– కొడుకుల నిర్వాకంతో ఇబ్బందులు ప‌డ్డ త‌ల్లిదండ్రులు

మిర్యాలగూడ, ప్రజాతంత్ర, జూన్‌ 6: ‌వృధ్ద తల్లిదండ్రులను దూరం పెట్టిన కొడుకులకు కలెక్టర్‌ ‌గట్టి బుద్ది చెప్పారు. వారి ఇంటిని వారికి స్వాధీనం చేయించారు. వివరాల్లోకి వెళితే..నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గల హౌసింగ్‌ ‌బోర్డ్ ‌కాలనీకి చెందిన ఇంజం చంద్రకళ భర్త రమణారెడ్డి(70) వయోవృద్ధులు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది. వారి విద్యాభ్యాసం, పెళ్లిళ్లు వంటి బాధ్యతలు అన్ని నిర్వర్తించారు. వీరికి సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ఇంజంవారిగూడెంలో వ్యవసాయ భూమి, మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్‌ ‌బోర్డ్ ‌కాలనీలో ఓ ఇల్లు వున్న‌ది. వీరి పేరు మీద ఉన్నటువంటి ఇంటిలో కుమారుడు గత ఐదేండ్లుగా నివాసం ఉంటూ తల్లిదండ్రులను రానివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. పక్షవాతం, మోకాళ్ల ఆపరేషన్‌, ఇతర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న వయోవృద్ధులు ఆర్డీఓ ట్రిబ్యునల్‌ అలాగే అప్పిలేట్‌ ‌ట్రిబ్యునల్‌, ‌సీనియర్‌ ‌సిటిజెన్స్ ‌చట్టాన్ని ఆశ్రయించడంతో వయోవృద్ధుల చట్టం 2007ను అనుసరించి జిల్లా కలెక్టర్‌ ‌గత నెల 15వ తేదీన సదరు ఆస్తిని వారికి స్వాధీనపరచాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను అమలు పరచాల్సిందిగా ఆర్డీఓ ఎస్‌.‌రమణారెడ్డి వివిధ డిపార్ట్‌మెంట్ల సమన్వయంతో జరపాలని గత 23వ తేదీ ఉత్తర్వులు ఇవ్వడంతో ఉత్తర్వుల అమలులో భాగంగా మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌నర్రా శ్రీజా రెడ్డి, స్థానిక సీఐ నాగభూషణం, తాసీల్దార్‌ ‌సిబ్బంది, రెవెన్యూ, మహిళా శిశు, దివ్యాంగుల వయో వృద్ధుల శాఖ అందరు కలిసి ఆ వయో వృద్ధులను శనివారం వారి ఇంటిలోకి చేర్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ ‌సిబ్బంది సైదులు, అనిల్‌ ‌కుమార్‌, ‌గోపమ్మ, మున్సిపల్‌ ‌సిబ్బంది సాజిద్‌, ‌సాంబయ్య, రెవెన్యూ శాఖ నుండి రాజు, ఆర్‌ఐ, ‌సిడిపిఓ కార్యాలయం నుండి రాములు గారు నాగిరెడ్డి నవీన్‌ ‌సునీల్‌ ‌తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *