అరుణాచల్‌ ‌ప్రదేశ్‌లో భూప్రకంపనలు

– రిక్టర్‌ ‌స్కెల్‌పై తీవ్రత 5.1గా నమోదు

ఇటానగర్‌,ఆగస్ట్ 6 : అరుణాచల్‌‌ప్రదేశ్‌లోని అప్పర్‌ ‌సియాంగ్‌ ‌జిల్లాలో గురువారం భూకంపం సంభవించింది. రిక్టర్‌ ‌స్కెల్‌పై దాని తీవ్రత 5.1గా నమోదయింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కానీ జరగలేదని నేషనల్‌ ‌సెంటర్‌ ‌ఫర్‌ ‌సీస్మాలజీ వెల్లడించింది. ఈ రోజు తెల్లవారుజాము 5.45 గంటలకు అప్పర సియాంగ్‌ ‌జిల్లాలోని పాంగిన్‌కు 116 కిలో టర్ల దూరంలో.. 11 కిలోటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వివరించింది. అయితే ఈ భూకంపానికి ముందు మూడు చిన్న ప్రకంపనలు చోటు చేసుకున్నాయని పేర్కొంది. అవి ఉదయం 3.40 గంటలకు 5 కిలోటర్ల లోతులో 2.8 తీవ్రతతో ఒకటి.. దీని తర్వాత 3.55 గంటలకు 3.2 తీవ్రతతో మరొకటి వచ్చిందని వివరించింది. అలాగే ఉదయం 4.34 గంటలకు 2.8 తీవ్రతో ఇంకొకటి వచ్చిందని తెలిపింది. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని అధికారులు తెలిపారు. రోవైపు ఇదే రాష్ట్రంలోని షి యోమి జిల్లాలో బుధవారం భూకంపం సంభవించింది. ఇది 5.0 తీవ్రతతో వచ్చింది. ఈ జిల్లాకు ఈశాన్యంగా 60 కిలోటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైంది. ఇక్కడ కూడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. దేశంలోని ఈశాన్య ప్రాంతం భూకంపం జోన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలో తరచూ అత్యధికంగా భూ ప్రకంపనలు జరుగుతున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *