– గంగంలోకి దిగి పట్టుకున్న షీటీమ్స్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 6 : బోనాల ఉత్సవాల సందర్భంగా మహిళల భద్రత కోసం షీటీమ్స్ ప్రత్యేక నిఘా చేపట్టాయి. ఉత్సవాల్లో భాగంగా దేవాలయాల వద్ద మహిళలను కొందరు వ్యక్తులు వేధింపులకు గురిచేశారు. మహిళల ఫిర్యాదు ఆధారంగా షీటీమ్స్ రంగంలోకి దిగారు. మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, వేధింపులకు గురిచేసిన 678 మంది ఈవ్‌టీజర్లను గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్, వీడియో ఆధారాలతో నిందితులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. విచారణ అనంతరం ఆకతాయిలను కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం పలువురికి శిక్షలు విధించింది. 25 మందికి జైలు శిక్షతోపాటు జరిమానాలను కోర్టు విధించింది. అలాగే 11 మందికి 3 రోజుల జైలు శిక్షతో పాటు రూ.1,050 జరిమానా విధించింది. మరో 26 మందికి రూ.1,050 చొప్పున జరిమానాతో పాటు సామాజిక సేవ చేయాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మహిళల భద్రతకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు