ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

హైదరాబాద్.ప్రజాతంత్ర,డిసెంబర్ 21:  భారత రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము  శీతాకాల విడిది , 5 రోజుల పర్యటన  ముగిసింది. భారత రాష్ట్రపతి ఈ నెల 17 న హైదరాబాదుకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి, సంక్షేమ పనులు, సాంస్కృతిక కార్యక్రమాలను రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ పర్యటన ముగించుకుని శనివారం హకింపేట విమానాశ్రయం  నుండి ప్రత్యేక విమానంలో దిల్లీ  బయలుదేరిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు  రాష్ట్ర  రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, భారత గనుల మంత్రిత్వ శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ  సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మేడ్చెల్ -మల్కాజగిరి జిల్లా కలెక్టర్ గౌతం  ఇతర అధికారులు  వీడ్కొలు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *