ఆర్థిక పరిస్థితిపై దిగజారి మాట్లాడవద్దు

– కొత్త సీఎం విజయ్‌కు స్టాలిన్ హెచ్చరిక

చెన్నై, మే 11 : తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు గడవకముందే ప్రతిపక్షాలు ఆయనపై విమర్శలకు దిగాయి. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే.స్టాలిన్ విజయ్ ప్రసంగాన్ని తప్పుబడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ ఆర్థిక పనితీరును విమర్శించడంపై సీఎం విజయ్‌ను హెచ్చరించారు. అప్పులపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్న విజయ్ మాటల్ని తప్పుబట్టిన ఆయన అబద్ధపు ప్రచారాలు ఆపాలంటూ చురకలంటించారు. ’ప్రభుత్వం వద్ద డబ్బు లేదని వెంటనే చెప్పడం ప్రారంభించవద్దు. డబ్బు ఉంది.. కావాల్సింది దానిని ప్రజలకు ఇవ్వాలనే సంకల్పం, పాలించే సామర్థ్యం. ఐదేళ్లుగా కొవిడ్, వరదల వంటి సంక్షోభాలు సహా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పోరాడుతూనే తాము ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామని చెప్పారు. ‘గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పును వదిలేసి ఖజానాను ఖాలీ చేసింది అనే ఆరోపణను మొదటి ప్రసంగంలోనే విజjáYT ప్రస్తావించారు.. నిజానికి రాష్ట్రంలో అప్పు పరిమిత స్థాయిలోనే ఉంది.. ఫిబ్రవరి బడ్జెట్‌లోనే మేము రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని స్పష్టంగా వివరించాం.. ఆ విషయం మీకు తెలియదా అని స్టాలిన్ ప్రశ్నించారు. మీకు వోటు వేసిన ప్రజలను మోసం చేసి విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయవద్దు.. ఆచరణాత్మకంగా సాధ్యమయ్యే వాగ్దానాలు మాత్రమే ఇస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు ఇప్పుడిప్పుడే ప్రభుత్వ పాలనను ప్రారంభిస్తున్నారు.. మాలాగే మీరు కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఎలా నెరవేర్చాలనే మెళకువలను త్వరలోనే తప్పకుండా నేర్చుకుంటారని నమ్ముతున్నాను.. మీకు ఓటు వేసిన ప్రజలతోపాటు నేనూ అదే ఆశిస్తున్నాను.. పాలనలో తమిళనాడు అభివృద్ధి ప్రస్థానం కొనసాగాలని మరోసారి నా శుభాకాంక్షలు’ అని స్టాలిన్ తన సందేశాన్ని ముగించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే విజయ్ సంతకం చేసిన ప్రకటనలను కూడా స్టాలిన్ స్వాగతించారు. ప్రతి ఇంటికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మాదక ద్రవ్యాల నిరోధక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయడం వంటివి ప్రధాన ప్రకటనలలో ఉన్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *