– 29న వరల్డ్ హార్ట్ డే
– శ్రీనివాస హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం
– కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్
హన్మకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: శ్రీనివాస హార్ట్ ఫౌండేషన్, శ్రీనివాస హార్ట్ సెంటర్ ఆధ్వర్యంలో 2001 నుంచి వరల్డ్ హార్ట్ డే కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట థీమ్ పై వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు ఆధారంగా డోంట్ మిస్ ఎ బీట్ వినూత్న కార్యక్రమం నిర్వహిస్తోందని కార్డియాలజిస్ట్ డాక్టర్ రామక శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 29న వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ వరల్డ్ హార్ట్ డే థీమ్ “డోంట్ మిస్ ఎ బీట్”, గుండె జబ్బులను ముందస్తుగా గుర్తించడంపై దృష్టి సారిస్తుందని, 2009 నుండి కమ్యూనిటీ సిపిఆర్ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోందని పేర్కొన్నారు. నేషనల్ సిపిఆర్ ఛాలెంజ్ క్యాంపెయిన్లో భాగంగా, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ ఎన్ఆర్ఐ పూర్వ విద్యార్థుల విద్యా కేంద్రంలో ఒక రోజు కమ్యూనిటీ సిపిఆర్ శిక్షణా కార్యక్రమ హై-క్వాలిటీ కార్డియోపల్మనరీ రీససిటేషన్ లో ఉచిత శిక్షణ, అంతర్జాతీయ మార్గదర్శకాల ప్రకారం ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ ఉపయోగించడం, పాల్గొనేవారికి సర్టిఫికేషన్ (సాఫ్ట్ కాపీ) ఇవ్వడం ఉంటుందని వివరించారు. తెలంగాణ ఐఎంఎ, తెలంగాణ కార్డియాలజికల్ సొసైటీ, తెలంగాణ అకాడమీ ఆఫ్ సైంట్స్, తానా-తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోంస్ అసోసియేషన్, అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా, వరంగల్ చాప్టర్, కాకతీయ మెడికల్ కాలేజ్ అల్‌మ్యూని వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వెళ్లడించారు. జిల్లా, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సాధారణ ప్రజలకు రెగ్యులర్ అవగాహనా, సిపిఆర్ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం, పబ్లిక్ యాక్సెస్ డిఫిబ్రిలేషన్ – ప్రజా ప్రదేశాల్లో ఎఈడిలను ఏర్పాటు చేయడం, ఈఎంఎస్ యాంబులెన్స్ సేవలను మెరుగుపరచడం, గుండె చికిత్సకు యాక్సెస్ పెంచడం వంటి చర్యలు చేపట్టడం అవసరమని తెలిపారు.
—————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





