నిబద్ధత గల నేత లక్ష్మణ్ బాపూజీ

– సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం దశాబ్దాల పాటు నిబద్ధతతో పోరాడిన ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తిని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని ఆయన సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి తన ఇల్లు, ఆస్తులను సైతం అంకితం చేసిన బాపూజీ ప్రజా హక్కులు, సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేశారని చెప్పారు. బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జీవితాంతం పనిచేసిన ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. తెలంగాణ కోసం బాపూజీ చేసిన త్యాగాలు, చూపిన మార్గం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన సేవలు శాశ్వతంగా గుర్తుండిపోయేలా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నామని గుర్తు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *