– టెక్ మహింద్రా సంస్థపై ఉద్యోగిని ఫిర్యాదు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23: ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రాపై మహిళా సాప్ట్‌వేర్ ఉద్యోగిని భావన దుండిగల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనారోగ్యం కారణంగా తాను, అనంతరం తన చిన్నారి ఆరోగ్యం బాగోలేక సెలవులు తీసుకున్న నేపథ్యంలో ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా సంస్థ ఉద్యోగం నుంచి తొలగించిందని ఆమె ఆరోపించారు. భావన తెలిపిన వివరాల ప్రకారం, అనారోగ్యంతో 13 రోజుల పాటు సెలవులో ఉన్న సమయంలో, అలాగే తన కుమార్తె అనారోగ్యం కారణంగా మరికొన్ని రోజులు సెలవు తీసుకున్నప్పటికీ, యాజమాన్యం ఈ-మెయిల్‌ల ద్వారా వెంటనే విధులకు హాజరు కావాలని ఒత్తిడి తెచ్చిందని పేర్కొన్నారు. వ్యక్తిగత పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా వేధింపులకు గురిచేశారని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా, కార్యాలయంలో వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేదని, ఉద్యోగులపై అత్యంత కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మహిళా ఉద్యోగులకు కుటుంబ బాధ్యతలు, చిన్నారుల సంరక్షణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఐటీ సంస్థలు మరింత మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. భావన ఫిర్యాదును స్వీకరించిన దుండిగల్ పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఆరోపణలపై టెక్ మహీంద్రా యాజమాన్యం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



