దమ్ముంటే నీట్‌పై చర్చకు రావాలి

– విపక్షాలకు బిజెపి అధ్యక్షుడు నితిన్‌ ‌నబిన్‌ ‌సవాల్‌

‌న్యూదిల్లీ ,జులై 23: దేశంలో ప్రకంపనలు పుట్టిస్తోన్న నీట్‌ ‌పరీక్ష వ్యవహారం, పేపర్‌ ‌లీక్‌ల అంశంపై పార్లమెంట్‌ ‌వేదికగా ఓపెన్‌ ‌డిబేట్‌కు సిద్ధమా అని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ ‌నబిన్‌ ‌విపక్షాలకు సవాల్‌ ‌విసిరారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీతో పాటు విపక్ష కూటమి పార్లమెంట్‌లో చర్చకు రాకుండా పారిపోతోందని, సభ ముందుకు వస్తే వారి ‘ద్వంద్వ నీతి’ బయట పడుతుందనే భయంతోనే వెనకడుగు వేస్తున్నారని నితిన్‌ ‌నబిన్‌ ఆరోపించారు. పేపర్‌ ‌లీక్‌ ‌దోషులకు కఠిన శిక్షలు ఖరారు చేసేందుకు ‘ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టులు’ ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన అనంతరం రాహుల్‌ ‌గాంధీ తీవ్ర విమర్శల నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. డియాతో మాట్లాడిన నితిన్‌ ‌నబిన్‌ ‌ప్రతిపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘విద్యార్థులు, యువత భవిష్యత్తుకు సంబంధించి ప్రతి అంశంపైనా లోక్‌సభలో చర్చించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉంది.సహా ఏ అంశంపైనైనా చర్చకు మేము సిద్ధం, రు సిద్ధమా? పార్లమెంట్‌ ‌వేదికగా చర్చకు రావాలని రాహుల్‌ ‌గాంధీకి సవాల్‌ ‌విసురుతున్నాం’ అని ఆయన అన్నారు. ‘రాహుల్‌ ‌గాంధీ రాజకీయ ప్రస్థానం అంతా పారిపోవడమే. దాదాపు 50-60 ఏళ్లుగా యువతను వంచించడం, రెచ్చగొట్టడం, దారి మళ్లించడమే కాంగ్రెస్‌ ‌చరిత్ర. అందుకే సభలో చర్చకు వస్తే తమ రంగు బయటపడుతుందని భయపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. విపక్షాలు యువతను కేవలం నిరసనకారులుగా,‘రాళ్లు విసిరేవారిగా’ మాత్రమే చూశాయని, కానీ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం యువతకు సురక్షితమైన, ప్రకాశవంతమైన భవిష్యత్తును అందించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *