కాంగ్రెస్ నేతలను విమర్శించలేదు

– మరోమారు రాజగోపాల్ రెడ్డి వివరణ

యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్టు 21 : కాంగ్రెస్‌లో బయట నుంచి వచ్చిన నాయకుల పెత్తనం ఎక్కువైందని మాత్రమే తాను చెప్పానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తాను చేసిన ఈ వ్యాఖ్యలపై మరోసారి మీడియాకు ఆయన స్పష్టత ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ సీతారామచంద్రస్వామి ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌లోనే ఉంటానని స్పష్టం చేశారు. తానెక్కడా పార్టీ నాయకులను విమర్శించలేదని, విమర్శించనని రాజ్‌గోపాల్ రెడ్డి తేల్చిచెప్పారు. నిజమైన కాంగ్రెస్ నాయకులను అణచివేస్తున్నారనే విషయాన్ని తాను గుర్తు చేశానన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో భాగంగా ఉద్యమకారులకు గుర్తింపు ఉండాలని సూచించారు. సీమాంధ్ర పాలకులు, సీమాంధ్ర మీడియా చెప్పుచేతల్లో తెలంగాణ కాంగ్రెస్, ప్రభుత్వాన్ని నడపవద్దని కోరారు. ప్రజాపాలన అంటే పేదల కోసం పనిచేయాలని సూచిస్తూ పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల”, సీమాంధ్ర నాయకుల కోసం కాదని అన్నారు. తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కూడా కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ రెడ్డి పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *