సంబంధం లేకుంటే ఖండించాలి క‌దా

– మంత్రి సురేఖపై పలువురు ఎమ్మెల్యేల ఆగ్రహం
– సీఎంపై ఎవరు తప్పుగా మాట్లాడినా చర్యలు తీసుకోవాల్సిందే

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. సుష్మితá వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయొద్దని, అది పూర్తిగా ఆమె వ్యక్తిగతమంటూ క్రమశిక్షణ కమిటీకి మంత్రి సురేఖ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ విప్‌లు బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, ఎమ్మెల్యేలు బాలునాయక్, నాయిని రాజేందర్ రెడ్డిలు సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుష్మిత వ్యాఖ్యలతో సురేఖకు సంబంధం లేకపోతే ఖండించాలన్నారు. ఎత్తిన జెండాను దించకుండా పార్టీని రేవంత్ అధికారంలోకి తెచ్చారని, ఆయనపై విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. సుస్మిత వ్యాఖ్యలపై సురేఖ స్పందించాలని డిమాండ్ చేశారు. కష్టపడుతున్న సీఎంపై బండలేస్తారా అంటూ నిలదీశారు. సొంత పార్టీ నేతలే సీఎంపై విమర్శలు చేయడం బాధాకరమని ఐలయ్య అన్నారు. కుమార్తె సుష్మిత వ్యాఖ్యలతో సురేఖకు సంబంధం లేకపోతే ఖండించాలని వేముల వీరేశం అన్నారు. సురేఖ భాష పార్టీని ఇబ్బంది పెడుతోందని, సమంత విషయంలో కూడా ఇలాగే మాట్లాడారని మండిపడ్డారు. ’విÖ తప్ప్పుడు భాషకు సీఎం మÖల్యం చెల్లించాలా.. విÖ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం పార్టీ బలి కావాలా అని ప్రశ్నించారు. అధికారంలోకి రావడానికి రేవంత్ చెమట చుక్కలు త్యాగం చేశారు.. ముఖ్యమంత్రిని బలహీనం చేయాలనే కుట్ర చేస్తున్నారు.. పార్టీలో జరుగుతున్న వ్యవహారంపై స్పందిస్తున్నాం.. సీఎంపై ఎవరు తప్ప్పుగా మాట్లాడినా చర్యలు తీసుకోవాలి.. సీఎం నిర్ణయాలను తప్ప్పుపట్టడం దుర్మార్గం.. ఆయన నిర్ణయాలు తప్ప్పు పట్టేవాళ్లు పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు.. సొంత పార్టీ నేతలు ప్రతిపక్షాలకు గొంతు ఇస్తున్నారు.. పార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన వారిని పక్కనపెట్టాలి.. పార్టీ వేదికలపై మాట్లాడాల్సిన విషయాలను బహిరంగంగా మాట్లాడతారా.. మైక్ దొరికితే ఊగిపోవడమేనా అంటూ సీఎంపై అసత్య ఆరోపణలు చేసినా, ఏకవచనంతో మాట్లాడినా ఊరుకోం’ అని హెచ్చరించారు. పార్టీకి వ్యతిరేకంగా రాజ్‌గోపాల్ రెడ్డి మాట్లాడినా, బాలు నాయక్ మాట్లాడినా చర్యలు తీసుకోవాలని బాలునాయక్ అన్నారు. షోకాజ్ నోటీసులు ఇచ్చి అయిపోయిందని అనుకోవద్దని, కులం, హోదాలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల కుట్రను సొంత పార్టీ వాళ్లు అమలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌ను బలహీనపర్చాలని చూస్తున్నారని, పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అన్నారు. పార్టీ అధికారంలోకి రావడానికి కారణం రేవంత్ అని, ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని బాలునాయక్ ధీమా వ్యక్తం చేశారు. సురేఖపై నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మీరు ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, ఒక్క ఎమ్మెల్యేతోనైనా సరిగా ఉన్నారా అని ప్రశ్నించారు. కష్టకాలంలో కాంగ్రెస్‌ను వదిలిపోయారని, వెళ్లేప్ప్పుడు బీఫారం తీసుకుని వెళ్లారని విమర్శించారు. నిరాధార ఆరోపణలు చేసి ప్రతిపక్షాలకు ఆయుధం ఇస్తున్నారన్నారు. ప్రభుత్వంలో ఉంటూ వ్యతిరేకంగా మాట్లాడడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాదిమంది త్యాగాన్ని వృధా చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. తప్ప్పు చేసిన వారిపై నిర్ణయాలు కఠినంగా ఉండాలన్నారు. కులాన్ని అడ్డుపెట్టుకుని ఏమైనా చేస్తామంటే కుదరదన్నారు. డూప్లికేట్ మనుషులు.. ఒరిజినల్ కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారని, ఏమైనా ఉంటే అధిష్ఠానం దగ్గర తేల్చుకోవాలని సూచించారు. పార్టీ నుంచి బహిష్కరించక ముందే వెళ్లిపోవాలని రాజేందర్ హితవు పలికారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *