– పోలీస్,ఫైర్, అంబులెన్స్‌కు ఇక ఒక్కటే నంబర్
-సేవలను ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: రాష్ట్రంలో డయల్ 112 సేవలు అందుబాటగులోకి వచ్చాయి. ఏ ఫిర్యాదుకైనా ఇక 112 ద్వారా సమాధానం వస్తుంది. డీజీపీ సీవీ ఆనంద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ డయల్ 112 ద్వారా 18 రకాల సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. న్యాయసాయం, వైద్యసాయం, సైబర్‌సాయం అనేక సమస్యల పరిష్కారాలకు డయల్ 112 పరిష్కార మార్గమని వ్యాఖ్యానించారు. డయల్ 112కు ఫోన్ చేసినప్పుడు పోలీసులు దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఒకే వ్యవస్థలోకి పోలీస్, ఫైర్, అంబులెన్స్ సేవలు, టిజిఐసిసి నుంచి డయల్ 112 సేవలను పర్యవేక్షి స్తామని డీజీపీ తెలిపారు. ప్రజల భద్రత, అత్యవసర స్పందన సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని వెల్లడించారు. డయల్ 112 ఫోన్ రాగానే కాలర్ లొకేషన్ కోసం అడ్వాన్స్ కాల్స్ వాడుతున్నామని పేర్కొన్నారు. డ్రోన్ బెస్డ్ టెక్నికల్ సిస్టంను త్వరలోనే తెలంగాణ పోలీసులు ఉపయోగిస్తారని వివరించారు. డ్రోన్ టీమ్‌ను సైతం ఏర్పాటు చేయబోతున్నామని చెప్పుకొచ్చారు. డయల్ 112 అనేది 3.0 వర్షన్‌గా ఉంటుందని తెలిపారు. యువ ఏపీఎస్‌లు, ఏఐ టెక్నాలజీ వాడే వారిని ఇందులో భాగస్వామ్యం చేయబోతున్నామని డీజీపీ ఆనంద్ పేర్కొన్నారు. బేసిక్ పోలీసింగ్ లాగా టెక్నాలజీ పోలీసింగ్‌ను అమల్లోకి తీసుకువస్తున్నామని వ్యాఖ్యానించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ టవర్‌లో రెండు ప్లోర్‌లను డయల్ 112కి కేటాయించామని తెలిపారు. డయల్ 100ను 2013లో కొంపల్లిలో జివికె వారి సాయంతో ప్రారంభించామని ప్రస్తావించారు. వివిధ అత్యవసరాలకు ఒకే నంబర్ ఉండాలని గతంలో కేందప్రభుత్వం సూచించిందని వెల్లడించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టెక్నికల్ డెవలప్‌మెంట్ చేస్తూ వచ్చామని అన్నారు. ఇటీవల ఏఐ వచ్చాక అనేక పనులు సులువుగా అయిపోతున్నాయని డీజీపీ ఆనంద్ వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు