హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28,: రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) బి.శివధర్ రెడ్డి 60వ జన్మదిన వేడుకలు పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగాయి. డీజీపీ జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో భాగంగా ‘అరైవ్ అలైవ’ ముఖచిత్రంతో ప్రత్యేకంగా రూపొందించిన కేకును డీజీపీ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో శాంతిభద్రతల విభాగం డీజీపీ మహేష్ ఎం.భగవత్, టీఎసఎల్‌పీఆర్‌బీ చైర్మన్ వి.వి.శ్రీనివాసరావు, ఎస్పీఎఫ్ డీజీ స్వాతి లక్రా, సీఐడీ డీజీపీ చారు సిన్హా, ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్‌బాబు, ఐజిపి చంద్రశేఖర్ రెడ్డితో పాటు పలువురు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. డీజీపీకి పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో సత్కరించారు. శివధర్ రెడ్డి ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కార్యాలయ అధికారులు, సిబ్బంది ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శివధర్ రెడ్డి మొక్కలను నాటారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



